తెలుగు సర్వసృష్టి నిర్మాణకుడా
పల్లవిసర్వసృష్టి నిర్మాణకుడా - ఆ సర్వాధిపతి స్తుతిస్తోత్రం
1)దాసుల గృహమగు ఐగుప్తునుండి - దోషులమైన మమ్ము
విడిపించి దేవుని గృహములో దివ్వెలుగజేసి - దేవా నీ
కొమరులుగాను జేసితి
|| సర్వసృష్టి ||
2)హస్తకృతాలయములలో నీవు - వాస్తవముగ నివసింపవు దేవా
హృదయమె నీదు ఆలయమయ్యా - కృపానిలయమా
యేసయ్య స్తోత్రం
|| సర్వసృష్టి ||
3)నిర్జీవమైన రాళ్ళవంటి మము - సజీవమైన రాళ్ళుగ జేసి
సంఘమనెడి మందిరముగ మమ్ము - శిల్పివి నీవై
నిర్మించుచుంటివి
|| సర్వసృష్టి ||
4)గృహము విత్తము పితరుల స్వాస్థ్యం - గృహిణీయును నీదగు
బహుమానం గర్భఫలమును నీ బహుమానం - గురియు నీవే
మాకనవరతం
|| సర్వసృష్టి ||
5)నీ సాయంబే లేకపోయిన - మా శ్రమయంత వృధయేకాదా
నీవే ఇల్లు కట్టకపోతే - మా ప్రయాస వ్యర్థమేరాజా
|| సర్వసృష్టి ||
6)దేనికి శిల్పియు నిర్మాణకుడవో - ఆ దివ్య పరమా
పురమునకు దీనులమైన మమ్ము దేవా - తీర్చిదిద్దుము దీనోపకారా
|| సర్వసృష్టి ||
English Sarvasrushti Nirmaanakudaa
ChorusSarvasrushti Nirmaanakudaa - Aa Sarvaadhipati Sthuthistotram
1)Daasula Gruhamagu Aiguptunundi - Doshulamaina Mammu
Vidipinchi Devuni Gruhamulo Divvelugajesi - Devaa Nee
Komarulugaanu Jesiti
|| Sarvasrushti ||
2)Hastakrutaalayamulalo Neevu - Vaastavamuga Nivasinpavu Devaa
Hrudayame Needu Aalayamayyaa - Krupaanilayamaa
Yesayya Stotran
|| Sarvasrushti ||
3)Nirjeevamaina Raallavanti Mamu - Sajeevamaina Raalluga Jesi
Sanghamanedi Mandiramuga Mammu - Silpivi Neevai
Nirminchuchuntivi
|| Sarvasrushti ||
4)Gruhamu Vittamu Pitarula Svaasthyan - Gruhineeyunu Needagu
Bahumaanan Garbhaphalamunu Nee Bahumaanan - Guriyu Neeve
Maakanavaratan
|| Sarvasrushti ||
5)Nee Saayanbe Lekapoyina - Maa Sramayanta Vrudhayekaadaa
Neeve Illu Kattakapote - Maa Prayaasa Vyarthameraajaa
|| Sarvasrushti ||
6)Deniki Silpiyu Nirmaanakudavo - Aa Divya Paramaa
Puramunaku Deenulamaina Mammu Devaa - Teerchididdumu Deenopakaaraa
|| Sarvasrushti ||