తెలుగు దేవా నీ ఆవరణం నాకెంతో
పల్లవిదేవా నీ ఆవరణం - నాకెంతో శ్రేయస్కరం
ఒక దినము ఇచట గడపిన మేలు - వేయి దినముల కంటెను
1)అద్భుత కార్యములు\... జరిగించు దేవుడవు\...
అనవరతము నీ మహిమను పొగడ - ఆత్మతో నింపుమయా
ఆత్మతో సత్యముతో ఆరాధించెద మనసుతో
అల్ఫా, ఓమెగయు, ఆత్మ రూపుడవు - ఆనందింపగనీ ఒడిలో
|| దేవా ||
2)పరిశుద్ధ సన్నిధిలో\... పరిశుద్ధాత్ముని నీడలో\...
పరిపూర్ణ హృదయముతో - పరివర్తనముతో ప్రభునిల స్తుతియించెదన్
మా దేహమే ఆలయం - కావాలి నీకే నిలయం
ప్రాణప్రియుడవు పదముల చేరి - పానార్పణము చేతుము
|| దేవా ||
3)అత్యంత పరిశుద్ధమౌ - నీదు గుడారములో
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము - హెచ్చించితివి
నీ దయన్ - జుంటి ధారలకన్నను - తేనె మధురిమ
కన్నను - శ్రేష్ఠమౌ నీదు వాక్కులచేత మమ్ము తృప్తిపరచుమయా
|| దేవా ||
English Devaa Nee Aavaranam Naakento
ChorusDevaa Nee Aavaranan - Naakento Sreyaskaram
Oka Dinamu Ichata Gadapina Melu - Veyi Dinamula Kantenu
1)Adbhuta Kaaryamulu\... Jariginchu Devudavu\...
Anavaratamu Nee Mahimanu Pogada - Aatmato Ninpumayaa
Aatmato Satyamuto Aaraadhincheda Manasuto
Alphaa, Omegayu, Aatma Roopudavu - Aanandinpaganee Odilo
|| Devaa ||
2)Parisudha Sannidhilo\... Parisudhaatmuni Needalo\...
Paripoorna Hrudayamuto - Parivartanamuto Prabhunila Sthuthiyinchedan
Maa Dehame Aalayan - Kaavaali Neeke Nilayam
Praanapriyudavu Padamula Cheri - Paanaarpanamu Chetumu
|| Devaa ||
3)Atyanta Parisudhamau - Needu Gudaaramulo
Nivasinchutaku Yogyata Nosagi Mammu - Hechchinchitivi
Nee Dayan - Junti Dhaaralakannanu - Tene Madhurima
Kannanu - Sreshthamau Needu Vaakkulacheta Mammu Truptiparachumayaa
|| Devaa ||