Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 825 Old No: 636

సంవత్సరములు

Samvatsaramulu

Open in Word & Worship App
తెలుగు   సంవత్సరములు
పల్లవి
సంవత్సరములు జరుగుచుండగా - నీ కార్యము నూతన పరచుము
సంవత్సరములు జరుగుచుండగా - ఉజ్జీవం మాకు కలిగించుము
ఓ యేసు రక్షకా మా విమోచకా - హల్లెలూయ, హల్లెలూయ
1)
గడచిన వత్సరములలో - ఎడబాయక కాపాడినావు
ఈ సంవత్సరాది మొదలు - సంవత్సారాంతము వరకు
నీ దృష్టి మాపై నిలిపి - కాపాడి రక్షింపుము
|| ఓ ||
2)
ఈ సంవత్సరములో - నీ దయా కిరీటమును
ధరింప జేసినావు - ఆనందమిచ్చినావు
నీ జాడలు సారమును - వెదజల్లుచుండును
|| ఓ ||
3)
నీ సంవత్సరములు - తరతరములుండును
నీ సంవత్సరములకు - అంతమేమియు లేదు
ఆకాశములు గతించిన - నీ వాక్యమే నిలుచును
|| ఓ ||
4)
కాలములు సమయములు - నీ వాక్యమే నిలుచును
మా కాలము సంకుచితము - నీ కాలము ఎంతో ఘనము
వెనుక ఉన్నవి మరిచి ముందుకు సాగెదము
|| ఓ ||
5)
నీ మాటలాలకించి - నిన్నే సేవింతుము
మా దినములు క్షేమముగా - జరుగ నియ్యుము
రానున్న వత్సరములు - సుఖముగ వెళ్ళనియ్యుము
|| ఓ ||
English   Samvatsaramulu
Chorus
Sanvatsaramulu Jaruguchundagaa - Nee Kaaryamu Nootana Parachumu
Sanvatsaramulu Jaruguchundagaa - Ujjeevan Maaku Kaliginchumu
O Yesu Rakshakaa Maa Vimochakaa - Hallelooya, Hallelooya
1)
Gadachina Vatsaramulalo - Edabaayaka Kaapaadinaavu
Ee Sanvatsaraadi Modalu - Sanvatsaaraantamu Varaku
Nee Drushti Maapai Nilipi - Kaapaadi Rakshinpumu
|| O ||
2)
Ee Sanvatsaramulo - Nee Dayaa Kireetamunu
Dharinpa Jesinaavu - Aanandamichchinaavu
Nee Jaadalu Saaramunu - Vedajalluchundunu
|| O ||
3)
Nee Sanvatsaramulu - Tarataramulundunu
Nee Sanvatsaramulaku - Antamemiyu Ledu
Aakaasamulu Gatinchina - Nee Vaakyame Niluchunu
|| O ||
4)
Kaalamulu Samayamulu - Nee Vaakyame Niluchunu
Maa Kaalamu Sankuchitamu - Nee Kaalamu Ento Ghanamu
Venuka Unnavi Marichi Munduku Saagedamu
|| O ||
5)
Nee Maatalaalakinchi - Ninne Sevintumu
Maa Dinamulu Kshemamugaa - Jaruga Niyyumu
Raanunna Vatsaramulu - Sukhamuga Vellaniyyumu
|| O ||
Present