Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 820 Old No: 401

శ్రీ యేసునాధునకున్

Shree Yesunaadhunakun

Open in Word & Worship App
తెలుగు   శ్రీ యేసునాధునకున్
పల్లవి
శ్రీయేసు నాథునకున్‌ - సునాద గీతములు సంతోషంతో
పాడుదము - సంవత్సరమంతయున్‌ స్తోత్రమున్‌ ప్రభావమమున్‌
బహు ఆధిపత్యము ఘనతలును సర్వయుగములు కలుగును
గాక ఆనంద మానంద మానందమే
1)
పాపభారపు దాస్యము నుండి - బయటకి నడిపించెను మనలన్‌
దుఃఖమును నిట్టూర్పును పోయెన్‌ - ఆనంద మానంద మానందమే
|| శ్రీయేసు ||
2)
పౌలు సీలలు పాడినరీతిగ - పలువిధ శ్రమలందున మనమున్‌
పాడుచు శ్రమలలో సాగుచు నెలమిన్‌ - పరమానంద భరితులమై
|| శ్రీయేసు ||
3)
క్రీస్తుయేసు నామమందున్‌ - కీర్తనల్‌ పాడుచునుండగన్‌
క్రీస్తుప్రభువు సంతసమొందగ - ఆనంద మానంద మానందమే
|| శ్రీయేసు ||
4)
కీర్తనల్‌ సంగీతమందున - నీతిబోధనలు బోధించు కొనుచు
దేవుని గూర్చిన గానము జేయుచు - దినదిన మానందం
బొందుచును
|| శ్రీయేసు ||
5)
ఆశ్చర్యకరుడాశ్చర్యకార్యముల్‌ - అనయము జేయును గనుక
హల్లెలూయని పాడుచునుందం - హల్లెలూయానందమానందమే
|| శ్రీయేసు ||
English   Shree Yesunaadhunakun
Chorus
Sreeyesu Naathunakun - Sunaada Geetamulu Santoshanto
Paadudamu - Sanvatsaramantayun Stotramun Prabhaavamamun
Bahu Aadhipatyamu Ghanatalunu Sarvayugamulu Kalugunu
Gaaka Aananda Maananda Maanandame
1)
Paapabhaarapu Daasyamu Nundi - Bayataki Nadipinchenu Manalan
DuHkhamunu Nittoorpunu Poyen - Aananda Maananda Maanandame
|| Sreeyesu ||
2)
Paulu Seelalu Paadinareetiga - Paluvidha Sramalanduna Manamun
Paaduchu Sramalalo Saaguchu Nelamin - Paramaananda Bharitulamai
|| Sreeyesu ||
3)
Kreestuyesu Naamamandun - Keertanal Paaduchunundagan
Kreestuprabhuvu Santasamondaga - Aananda Maananda Maanandame
|| Sreeyesu ||
4)
Keertanal Sangeetamanduna - Neetibodhanalu Bodhinchu Konuchu
Devuni Goorchina Gaanamu Jeyuchu - Dinadina Maanandam
Bonduchunu
|| Sreeyesu ||
5)
Aascharyakarudaascharyakaaryamul - Anayamu Jeyunu Ganuka
Hallelooyani Paaduchunundan - Hallelooyaanandamaanandame
|| Sreeyesu ||
Present