తెలుగు వందనంబొనర్తుమో ప్రభో
పల్లవివందనంబొనర్తుమో ప్రభో ప్రభో - వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
1)ఇన్నినాళ్ళు ధరను మమ్ము బ్రోచియు - కన్నతండ్రి మించి
యెపుడు గాచియు - యెన్నలేని దీవెనలిడు అన్నయేసువా
అన్నిరెట్లు స్తోత్రము లివిగో
|| వంద ||
2)పాతవత్సరంపు పాపమంతయు - బ్రీతిని మన్నించి మమ్ము -
గావుము - నూతనాబ్దమునకు నీదు నీతినొసగుమా -
దాత క్రీస్తునాథ రక్షకా
|| వంద ||
3)దేవ మాదు కాలుసేతులెల్లను - సేవకాళి తనువు దినము
లన్నియు - నీవొసంగు వెండిపసిడి జ్ఞానమంత
నీ సేవకై యంగీకరించుమా
|| వంద ||
4)కోతకొరకు దాసజనమునంపుము - ఈతరి మాలోటుపాట్లు
దీర్చుము - పాతకంబు లెల్లబాపి భీతిబాపుము
ఖ్యాతినొందు నీతి సూర్యుడా
|| వంద ||
5)మాసభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తినీయుము
మోసపుచ్చునంధకారమంత ద్రోయుము
యేసుకృపన్ గుమ్మరించుము
|| వంద ||
English Vandanambonarthamo Prabho
ChorusVandanambonartumo Prabho Prabho - Vandanambonartumo Prabho Prabho
Vandanambu Tandri Tanaya Suddaatmudaa - Vandanambu Landuko Prabho
1)Inninaallu Dharanu Mammu Brochiyu - Kannatandri Minchi
Yepudu Gaachiyu - Yennaleni Deevenalidu Annayesuvaa
Anniretlu Stotramu Livigo
|| Vanda ||
2)Paatavatsaranpu Paapamantayu - Breetini Manninchi Mammu -
Gaavumu - Nootanaabdamunaku Needu Neetinosagumaa -
Daata Kreestunaatha Rakshakaa
|| Vanda ||
3)Deva Maadu Kaalusetulellanu - Sevakaali Tanuvu Dinamu
Lanniyu - Neevosangu Vendipasidi Gnaanamanta
Nee Sevakai Yangeekarinchumaa
|| Vanda ||
4)Kotakoraku Daasajanamunanpumu - Eetari Maalotupaatlu
Deerchumu - Paatakanbu Lellabaapi Bheetibaapumu
Khyaatinondu Neeti Sooryudaa
|| Vanda ||
5)Maasabhalanu Peddajesi Penchumu - Nee Suvaarta Jeppa Saktineeyumu
Mosapuchchunandhakaaramanta Droyumu
Yesukrupan Gummarinchumu
|| Vanda ||