తెలుగు దేవుని కృపయే గత
పల్లవిదేవుని కృపయే గతయేడంతా నను కాపాడెనే\... నిను కాపాడెనే
1)పాపులమైన మనల రక్షించి సహవాసములో
మనలను పెంచి దేవునివాక్య దర్శనమిచ్చి
నను కాపాడెనే నిను కాపాడెనే
|| దేవుని ||
2)అలలను పోలిన ఆపదలన్నిటిన్ - లోయల బోలిన
లోపములన్నిటిన్ - తప్పించి సవరించుచు ప్రభువు
నను కాపాడెనే నిను కాపాడెనే
|| దేవుని ||
3)మ్రింగవలెనని పొంచియున్న - జల్లింతునని జడియగొట్టిన
సాతాను యనె సింహమునుండి నను కాపాడెనే నిను కాపాడెనే
|| దేవుని ||
4)బలవంతుడ నీ బాహుబలముచే బలహీనుల మము బలపరిచితివే
వత్సరమంతయు వదలక నీ కృప మము కాపాడెనే మరి కాపాడెనే
|| దేవుని ||
5)కోతకాలము గ్రీష్మకాలము - కాలములన్నియు గడచిపోయెనే
రక్షణనొందని స్నేహితులారా - ప్రభువును నమ్ముడి రక్షణ పొందుడి
|| దేవుని ||
6)విడువక మాయెడ కృపజూపితివే - శాశ్వత ప్రేమచే ప్రేమించితివే
యోగ్యులుగా జేసెను - పాత్రులుగా చేసెనే
|| దేవుని ||
7)ఓ నా ప్రాణమా ప్రభుని స్మరించుమా మరువకు మాయన
ఉపకారములను అనుదిన మాయన కృపల దలంచుచు
హల్లెలూయ పాడుమా స్తుతియించుచుండుమా
|| దేవుని ||
English Devuni Krupaye Gatha
ChorusDevuni Krupaye Gatayedantaa Nanu Kaapaadene\... Ninu Kaapaadene
1)Paapulamaina Manala Rakshinchi Sahavaasamulo
Manalanu Penchi Devunivaakya Darsanamichchi
Nanu Kaapaadene Ninu Kaapaadene
|| Devuni ||
2)Alalanu Polina Aapadalannitin - Loyala Bolina
Lopamulannitin - Tappinchi Savarinchuchu Prabhuvu
Nanu Kaapaadene Ninu Kaapaadene
|| Devuni ||
3)Mringavalenani Ponchiyunna - Jallintunani Jadiyagottina
Saataanu Yane Sinhamunundi Nanu Kaapaadene Ninu Kaapaadene
|| Devuni ||
4)Balavantuda Nee Baahubalamuche Balaheenula Mamu Balaparichitive
Vatsaramantayu Vadalaka Nee Krupa Mamu Kaapaadene Mari Kaapaadene
|| Devuni ||
5)Kotakaalamu Greeshmakaalamu - Kaalamulanniyu Gadachipoyene
Rakshananondani Snehitulaaraa - Prabhuvunu Nammudi Rakshana Pondudi
|| Devuni ||
6)Viduvaka Maayeda Krupajoopitive - Saasvata Premache Preminchitive
Yogyulugaa Jesenu - Paatrulugaa Chesene
|| Devuni ||
7)O Naa Praanamaa Prabhuni Smarinchumaa Maruvaku Maayana
Upakaaramulanu Anudina Maayana Krupala Dalanchuchu
Hallelooya Paadumaa Sthuthiyinchuchundumaa
|| Devuni ||