తెలుగు ప్రభు గొప్ప కార్యములు
పల్లవిప్రభు గొప్ప కార్యములు చేసెనని మన ముత్సహించెదము
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా
ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె
పాత్రులముగా సేవింతుము
1)దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము
దేవుని ఆశ్చర్యకార్యము మనలో ధ్యానించి పాడెదము
|| ప్రభు ||
2)సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని
సితార స్వర మండలములతో మన మార్భటించెదము
|| ప్రభు ||
3)మన భారములన్నియు తొలగించి - ఘన కార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో
|| ప్రభు ||
4)నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే - ధైర్యముగా పాడెదం
|| ప్రభు ||
5)ప్రేమాసౌందర్యముల్ గలవాడు - క్షేమమునిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే - మహిని బొగడెదము
|| ప్రభు ||
6)మనకెన్నో వాగ్ధానము లిచ్చె - మన మనుభవించితిమి
ఘనతామహిమ ప్రభావము ప్రభునకె - హల్లెలూయ ఆమెన్
|| ప్రభు ||
English Prabhu Goppa Kaaryamulu
ChorusPrabhu Goppa Kaaryamulu Chesenani Mana Mutsahinchedamu
Prabhu Goppa Melula Varshamu Manapai Kuripinche Nahaa
Aahaa Stotramu Stotramulu - Intavaraku Kaache
Paatrulamugaa Sevintumu
1)Daiva Kaaryamulu Janamula Madhya Prasiddhi Cheyudamu
Devuni Aascharyakaaryamu Manalo Dhyaaninchi Paadedamu
|| Prabhu ||
2)Sangeeta Gaanamulatonu Sannutinchuchu Prabhuni
Sitaara Svara Mandalamulato Mana Maarbhatinchedamu
|| Prabhu ||
3)Mana Bhaaramulanniyu Tolaginchi - Ghana Kaaryamulanu Jese
Dinamella Paaduchu Ghanaparachedamu - Chaatincheda Milalo
|| Prabhu ||
4)Nootana Kaaryamulu Cheyuvaadu - Prabhu Vaascharyakarudu
Balamagu Kaaryamulu Cheyuvaadaayane - Dhairyamugaa Paadedan
|| Prabhu ||
5)Premaasaundaryamul Galavaadu - Kshemamunichchuvaadu
Mahimaisvaryamulu Galavaadaayane - Mahini Bogadedamu
|| Prabhu ||
6)Manakenno Vaagdhaanamu Lichche - Mana Manubhavinchitimi
Ghanataamahima Prabhaavamu Prabhunake - Hallelooya Aamen
|| Prabhu ||