Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 816 Old No: 402

క్రొత్తయేడు మొదలు బెట్టను

Krothayedu Modalu Bettanu

Open in Word & Worship App
తెలుగు   క్రొత్తయేడు మొదలు బెట్టను
పల్లవి
క్రొత్తయేడు మొదలు బెట్టెను - మన బ్రతుకునందు
క్రొత్త మనసుతోడ మీరు - క్రొత్తయేట ప్రభుని సేవ
దత్తర పడకుండ జేయు - టుత్త మోత్తంబు జూడ
1)
పొందియున్న మేలులన్నియు - బొంకంబు మీఱడెందమందు
స్మరణజేయుడి ఇందుమీరు మొదలుబెట్టు పందెమందు గెల్వ
వలయు - నందముగను రవినిబోలి - నలయకుండ సొలయకుండ
|| క్రొత్త ||
2)
మేలుసేయ దడవొనర్పగ - మీరెఱుగునట్లు కాలమంత నిరుడు
గడచెగా ప్రాలుమాలి యుండకుండ - జాల మేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనత కొఱకు
|| క్రొత్త ||
3)
బలములేని వారమయ్యును బలమొందవచ్చు - గలిమిమీఱ గర్త
వాక్కున నలయకుండ నడగుచుండ - నలగకుండ మోద
మొంది బలమొసంగు సర్వవిధుల - నెలమి మీరొనర్చుచుండ
|| క్రొత్త ||
4)
పాపపంకమంటినప్పుడు - ప్రభు క్రీస్తు యేసు ప్రాపుజేరి
మీరు వేడగ నేపుమీఱ దనదుకరుణ - బాపమంత గడిగివేసి
పాపరోగ చిహ్నలన్ని - బాపివేసి శుద్ధి జేయు
|| క్రొత్త ||
English   Krothayedu Modalu Bettanu
Chorus
Krottayedu Modalu Bettenu - Mana Bratukunandu
Krotta Manasutoda Meeru - Krottayeta Prabhuni Seva
Dattara Padakunda Jeyu - Tutta Mottanbu Jooda
1)
Pondiyunna Melulanniyu - Bonkanbu Meeradendamandu
Smaranajeyudi Indumeeru Modalubettu Pandemandu Gelva
Valayu - Nandamuganu Raviniboli - Nalayakunda Solayakunda
|| Krotta ||
2)
Meluseya Dadavonarpaga - Meererugunatlu Kaalamanta Nirudu
Gadachegaa Praalumaali Yundakunda - Jaala Melu Seyavalayu
Jaala Janamula Kimmaanu - Yelu Naama Ghanata Koraku
|| Krotta ||
3)
Balamuleni Vaaramayyunu Balamondavachchu - Galimimeera Garta
Vaakkuna Nalayakunda Nadaguchunda - Nalagakunda Moda
Mondi Balamosangu Sarvavidhula - Nelami Meeronarchuchunda
|| Krotta ||
4)
Paapapankamantinappudu - Prabhu Kreestu Yesu Praapujeri
Meeru Vedaga Nepumeera Danadukaruna - Baapamanta Gadigivesi
Paaparoga Chihnalanni - Baapivesi Suddhi Jeyu
|| Krotta ||
Present