Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 808 Old No: 392

మంగళమే యేసునకు

Mangalame Yesunaku

Open in Word & Worship App
తెలుగు   మంగళమే యేసునకు
పల్లవి
మంగళమే యేసునకు - మనుజావతారునకు
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి
1)
పరమ పవిత్రునకు - వరదివ్య తేజునకు
నిరుపమానందునకు - నిపుణ వైద్యునకు
|| మంగ ||
2)
దురిత సంహారునకు - వరసుగుణోదారునకు
కరుణా సంపన్నునకు - జ్ఞాన దీప్తునకు
|| మంగ ||
3)
సత్యప్రవర్తునకు - సద్ధర్మశీలునకు
నిత్యస్వయంజీవునకు - నిర్మలాత్మునకు
|| మంగ ||
4)
యుక్తస్తోత్రార్హునకు - భక్తరక్షామణికి
సత్యపరంజ్యోతియగు - సార్వభౌమునకు
|| మంగ ||
5)
నరఘోర కలుషముల - నురుమారంగ నిల
కరుదెంచిన మాపాలి - వర రక్షకునకు
|| మంగ ||
6)
పరమపురి వాసునకు - నరదైవ రూపునకు
పరమేశ్వర తనయునకుఁ - బ్రణుతింతుము నిన్ను
|| మంగ ||
English   Mangalame Yesunaku
Chorus
Mangalame Yesunaku - Manujaavataarunaku
Srngaara Prabhuvunaku Kshemaadhipatiki
1)
Parama Pavitrunaku - Varadivya Tejunaku
Nirupamaanandunaku - Nipuna Vaidyunaku
|| Manga ||
2)
Durita Sanhaarunaku - Varasugunodaarunaku
Karunaa Sanpannunaku - Gnaana Deeptunaku
|| Manga ||
3)
Satyapravartunaku - Sadharmaseelunaku
Nityasvayanjeevunaku - Nirmalaatmunaku
|| Manga ||
4)
Yuktastotraarhunaku - Bhaktarakshaamaniki
Satyaparanjyotiyagu - Saarvabhaumunaku
|| Manga ||
5)
Naraghora Kalushamula - Nurumaaranga Nila
Karudenchina Maapaali - Vara Rakshakunaku
|| Manga ||
6)
Paramapuri Vaasunaku - Naradaiva Roopunaku
Paramesvara Tanayunakun - Branutintumu Ninnu
|| Manga ||
Present