తెలుగు కానాపురంబులో
పల్లవికానాపురంబులోఁ గడువింతగా నీరు - జానుగా ద్రాక్షారసము జేసి
పానముగఁ బెండ్లిలో - బాగుగా నిచ్చిన
దీన రక్షక బెండ్లి - దీవించు మీ
1)రావయ్య పెండ్లికి - రయముగా నో యేసు
ఈవు లియ్యగ వచ్చు హితుని బోలి
కావు మీ ద్వంద్వమును ఘనమైన కృపచేత
భావ మాలిన్యంబుఁ - బాపియిపుడు
|| కానా ||
2)దయ నుంచు మయ్య యీ - దంపతులమీఁద
సదయుఁడవై కాపాడు - తండ్రి వలెను
నియమంబుగా వీరు - నీ చిత్తమును జరిపి
భయము లేకుండఁగ - బ్రతుకనిమ్ము
|| కానా ||
3)ఒప్పు మీరఁగఁ జేయు - నొప్పందమును వీర
లెప్పుడును మదిలోన నిడుకొనుచును
దప్పకుండఁగ దాని - నిప్పుడమిలో నెపుడు
గొప్పగా నెరవేర్ప - గూడ నుండు
|| కానా ||
4)చక్కఁగా నెగడింప - సంసార భారంబు
నెక్కువగు నీ యాత్మ - నిపుడొసంగి
గ్రక్కునను దీవించు - కరుణానిధి
|| కానా ||
5)పిల్లలను నీ వొసఁగ - బ్రియముతో నో దేవ
పెల్లుగా బోధింప వెరపు జూపు
యెల్ల వేళలలోన - నిరుకు మార్గము నందు
జల్లఁగా నడిపింప - శక్తి నిమ్ము
|| కానా ||
English Kaanaapurambhulo
ChorusKaanaapuranbulon Gaduvintagaa Neeru - Jaanugaa Draakshaarasamu Jesi
Paanamugan Bendlilo - Baagugaa Nichchina
Deena Rakshaka Bendli - Deevinchu Mee
1)Raavayya Pendliki - Rayamugaa No Yesu
Eevu Liyyaga Vachchu Hituni Boli
Kaavu Mee Dvandvamunu Ghanamaina Krupacheta
Bhaava Maalinyanbun - Baapiyipudu
|| Kaanaa ||
2)Daya Nunchu Mayya Yee - Danpatulameenda
Sadayundavai Kaapaadu - Tandri Valenu
Niyamanbugaa Veeru - Nee Chittamunu Jaripi
Bhayamu Lekundanga - Bratukanimmu
|| Kaanaa ||
3)Oppu Meerangan Jeyu - Noppandamunu Veera
Leppudunu Madilona Nidukonuchunu
Dappakundanga Daani - Nippudamilo Nepudu
Goppagaa Neraverpa - Gooda Nundu
|| Kaanaa ||
4)Chakkangaa Negadinpa - Sansaara Bhaaranbu
Nekkuvagu Nee Yaatma - Nipudosangi
Grakkunanu Deevinchu - Karunaanidhi
|| Kaanaa ||
5)Pillalanu Nee Vosanga - Briyamuto No Deva
Pellugaa Bodhinpa Verapu Joopu
Yella Velalalona - Niruku Maargamu Nandu
Jallangaa Nadipinpa - Sakti Nimmu
|| Kaanaa ||