తెలుగు దేవర నీ దీవెనలు
పల్లవిదేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై
బాగుగా వేగమె దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను
1)దంపతులు దండిగ నీ ధాత్రిలో - వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై
2)ఈకవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో
శోకములేకయె యేకముగా - ప్రాకటముగను జేకొనుము
3)ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచుదా
మొప్పినచొప్పున దప్పకను - యెప్పగ బ్రతుకగ బంపుకృపన్
4)తాపములు! పాపములు - మోపుగ వీరిపై రాకుండగా
కాపుగ ప్రాపుగ దాపు నుండి - యాపదలన్నియు బాపుచును
5)సాధులుగన్ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగా
గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్
6)మెండుగ భూమండలపు - గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ అండనుండి - వెంబడి వానిని ఖండించవే
7)ఇద్దరు వీరిద్దరును - శుద్ధులై నిను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్
8)వాసిగ నీదాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని
మాసకలేశ్వర నీసుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్
English Devara Nee Deevenalu
ChorusDevara Nee Deevenalu - Dhaaralamuganu Veeralapai
Baagugaa Vegame Diganimmu - Paavana Yesuni Dvaaraganu
1)Danpatulu Dandiga Nee Dhaatrilo - Velayuchu Sanpadalan
Sonpuga Ninpuga Penpaguchu - Sahinpuna Veeru Sukhinchutakai
2)Eekavanu Nee Karunan - Aakharu Varakunu Lokamulo
Sokamulekaye Yekamugaa - Praakatamuganu Jekonumu
3)Ippagidi Neppudunu - Goppagu Premato Noppuchudaa
Moppinachoppuna Dappakanu - Yeppaga Bratukaga Banpukrupan
4)Taapamulu! Paapamulu - Mopuga Veeripai Raakundagaa
Kaapuga Praapuga Daapu Nundi - Yaapadalanniyu Baapuchunu
5)Saadhulugan Jeyutakai - Sodhanalache Neevu Sodhinpagaa
Gadalaka Vadalaka Mudamuna Nee - Paadamu Daapuna Baadukonan
6)Menduga Bhoomandalapu - Gandamulalo Veerundaganu
Tandriga Dandiga Andanundi - Venbadi Vaanini Khandinchave
7)Iddaru Veeriddarunu - Suddhulai Ninu Sevinchutakai
Sradhato Buddhiga Sidhapadan - Diddumu Nee Priya Biddalugan
8)Vaasiga Needaasulamu - Chesina Yee Moral Deesikoni
Maasakalesvara Neesutudau - Yesuni Perita Brovu Maamen