తెలుగు ఘనుడైన యెహోవాయే
పల్లవిఘనుడైన యెహోవాయే - జరిగించె వివాహమును
సృష్ట్యారంభమున - ఆ ఆ సృష్ట్యారంభమున
1)పరిశుద్ధత కాపాడుటకై - ప్రభువేర్పరచె వివాహమును
పరిశుద్ధముగా ఘనమైనదిగా - ప్రభుయేసులో జరిగింపవలెన్
|| ఘన ||
2)భూమిని నింపను జనులతో - దీవెన లొసంగె వివాహములో
ఫలభరితముగా పవిత్రముగా - పతులకు లోబడి
సతులుండవలెన్
|| ఘన ||
3)ప్రభుయేసు సంఘమునువలె - పురుషులు తమ భార్యల నెపుడు
ప్రేమంచుచును పోషించుచును - తగుమాదిరిగా జీవింపవలెన్
|| ఘన ||
4)గుణవంతులైన భార్యలిల - సత్క్రియ లతో నొప్పారుచును
తమ భర్తలను ఘనపరచుచును - కిరీటముగా భాసిల్లెదరు
|| ఘన ||
English Ghanuudaina Yehovaaaye
ChorusGhanudaina Yehovaaye - Jariginche Vivaahamunu
Srushtyaaranbhamuna - Aa Aa Srushtyaaranbhamuna
1)Parisudhata Kaapaadutakai - Prabhuverparache Vivaahamunu
Parisudhamugaa Ghanamainadigaa - Prabhuyesulo Jariginpavalen
|| Ghana ||
2)Bhoomini Ninpanu Janulato - Deevena Losange Vivaahamulo
Phalabharitamugaa Pavitramugaa - Patulaku Lobadi
Satulundavalen
|| Ghana ||
3)Prabhuyesu Sanghamunuvale - Purushulu Tama Bhaaryala Nepudu
Premanchuchunu Poshinchuchunu - Tagumaadirigaa Jeevinpavalen
|| Ghana ||
4)Gunavantulaina Bhaaryalila - Satkriya Lato Noppaaruchunu
Tama Bhartalanu Ghanaparachuchunu - Kireetamugaa Bhaasilledaru
|| Ghana ||