Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 802 Old No: 393

వింద్రు పరమందు బెండ్లి

Vindru Paramandu Bendli

Open in Word & Worship App
తెలుగు   వింద్రు పరమందు బెండ్లి
పల్లవి
విందు పరమందుఁ బెండ్లి - విందు పరమందుఁ - బొందు
జనుల దెండము లా - నందము నొందు
1)
సత్య సంధుఁడైన యేసు - స్వామికి, సభకు
నిత్య ప్రధానము యెహోవా - నిర్ణయించెను రండు
|| విందు ||
2)
నీతి కనికరములతోడఁ - నినుం బ్రధానము
ప్రీతిగా నొనరించితి నని - పిలిచె సత్యము రండు
|| విందు ||
3)
ఎన్నఁడు విడఁనాడను నే - నెంతమాత్రము
నిన్నెడఁబాయ నను మాట - నిజము దత్తము రండు
|| విందు ||
4)
పరమ నగరు ద్వారములు - తెరువఁబడినవి
గురుతరమణి తోరణములు - గూర్పఁబడినవి రండు
|| విందు ||
5)
నిత్య జీవ పదార్థములు - నిండియున్నవి
సత్యమచట మనముచేర - సర్వము మనవి రండు
|| విందు ||
6)
దూత లంత యేసు ప్రభుని - బ్రీతిఁజేయను
నూతన సంగీతములను - జేతురు వినను రండు
|| విందు ||
English   Vindru Paramandu Bendli
Chorus
Vindu Paramandun Bendli - Vindu Paramandun - Bondu
Janula Dendamu Laa - Nandamu Nondu
1)
Satya Sandhundaina Yesu - Svaamiki, Sabhaku
Nitya Pradhaanamu Yehovaa - Nirnayinchenu Randu
|| Vindu ||
2)
Neeti Kanikaramulatodan - Ninun Bradhaanamu
Preetigaa Nonarinchiti Nani - Piliche Satyamu Randu
|| Vindu ||
3)
Ennandu Vidannaadanu Ne - Nentamaatramu
Ninnedanbaaya Nanu Maata - Nijamu Dattamu Randu
|| Vindu ||
4)
Parama Nagaru Dvaaramulu - Teruvanbadinavi
Gurutaramani Toranamulu - Goorpanbadinavi Randu
|| Vindu ||
5)
Nitya Jeeva Padaarthamulu - Nindiyunnavi
Satyamachata Manamuchera - Sarvamu Manavi Randu
|| Vindu ||
6)
Doota Lanta Yesu Prabhuni - Breetinjeyanu
Nootana Sangeetamulanu - Jeturu Vinanu Randu
|| Vindu ||
Present