Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 800 Old No: 788

స్థిరమైనది పరలోకం

Sthiramainadi Paralokam

Open in Word & Worship App
తెలుగు   స్థిరమైనది పరలోకం
పల్లవి
స్థిరమైనది పరలోకం - స్థిరము కాదు ఇల నీ జీవితం
ప్రభువే పరలోక మార్గము - ప్రభువే జీవము ఓ సోదరా, ఓ సోదరి
1)
అబ్రహాము ఆశించిన దేశము ఆకలి శోకము లేని దేశము
రాజవీధి అది శుద్ధ సువర్ణము రాజులరాజుని స్తుతియించెదం
|| స్థిర ||
2)
రాత్రి ఉండదు పరలోకములో సూర్యచంద్రులు అక్కరలేదు
నీతి సుర్యుడు యేసు ప్రభువె ప్రకాశించును యుగయుగముల్‌
|| స్థిర ||
3)
ఆత్మల సంపాదించినవారే అతిశయింతురు ఆ దినము
అతిశయ కిరీటములు ధరియించి ఆనందింతురు యుగయుగముల్‌
|| స్థిర ||
4)
జీవ గ్రంథములో పేరు కలిగిన వారే దానిలో ప్రవేశింతురు
జీవ వృక్ష ఫలములు భుజియించి జీవించెదరు యుగయుగముల్‌
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు
|| స్థిర ||
English   Sthiramainadi Paralokam
Chorus
Sthiramainadi Paralokan - Sthiramu Kaadu Ila Nee Jeevitam
Prabhuve Paraloka Maargamu - Prabhuve Jeevamu O Sodaraa, O
Sodari
1)
Abrahaamu Aasinchina Desamu Aakali Sokamu Leni Desamu
Raajaveedhi Adi Sudha Suvarnamu Raajularaajuni Sthuthiyinchedan
|| Sthira ||
2)
Raatri Undadu Paralokamulo Sooryachandrulu Akkaraledu
Neeti Suryudu Yesu Prabhuve Prakaasinchunu Yugayugamul
|| Sthira ||
3)
Aatmala Sanpaadinchinavaare Atisayinturu Aa Dinamu
Atisaya Kireetamulu Dhariyinchi Aanandinturu Yugayugamul
|| Sthira ||
4)
Jeeva Granthamulo Peru Kaligina Vaare Daanilo Pravesinturu
Jeeva Vruksha Phalamulu Bhujiyinchi Jeevinchedaru Yugayugamul
|| Sthira ||
Present