Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 8 Old No: 11

నన్నెంతో ప్రేమించి స్వర్గాన్ని

Nannemto Premimchi Svargaanni

Open in Word & Worship App
తెలుగు   నన్నెంతో ప్రేమించి స్వర్గాన్ని
పల్లవి
నన్నెంతో ప్రేమించి స్వర్గాన్ని విడిచి భూమికి దిగినట్టి
ప్రాణనాథా నన్ను రక్షింపను - శాపాన్ని సహిస్తు కల్వరికెక్కిన జీవరాజా!
1)
ఆశ్చర్యమైన ఈ ప్రేమన్‌ నేను ఎట్లు గ్రహింతును
నిర్మలమైన ఈ స్నేహితమును ఎట్లు తీర్చుకొందును
హృదయం కరిగిపోయింది - ఈ ప్రేమజ్వాలచే
పాపపు భారము పోయింది ధన్యుడనైతినీ ఈ ఈ ఈ
|| నన్నెం ||
2)
ఐశ్వర్యవంతుడవైన నీవు - నా కొరకు దారిద్ర్యం ధరియించితివా
నా కొస్త్రం ధరియింప ముళ్ళకిరీటం - ధరియించితివా నా ఆప్తుడా
నిందవమానములను నీవు - ఎంతో సహించితివా
పాపపు శాపపు భారమును - నీ దేహంలో వహించితివా
పవిత్రమైన నీ దేహాన్ని విరచుట కొప్పితివా
అమూల్యమైన నీ రక్తమున్‌ - నా కొరకు చిందించితివా
ఆ..... ఆ..... ఆ.....
|| నన్నెం ||
3)
గొల్గొతరాజవు, నా ప్రాణ ప్రియుడవు - స్తుతికి యోగ్యుడవు
నీవొక్కడవే - తండ్రి చిత్తానికి లోబడి వచ్చిన దేవుని గొఱ్ఱెవు
నీవేనయా, శాస్త్రపు మాట ప్రకారం నీవు - సిలువనెక్కితివా,
సమాధినుండి జీవంతో నీవు పునరుత్థానుడవైతివి,
తండ్రి కుడివైపునకెక్కితివి నా విమోచకుడవు,
భూమికి తిరిగి వచ్చెదవు - ఓ దివ్య రక్షకుడా
ఆ.... ఆ.... ఆ.....
|| నన్నెం ||
English   Nannemto Premimchi Svargaanni
Chorus
Nannento Preminchi Svargaanni Vidichi Bhoomiki Diginatti
Praananaathaa Nannu Rakshinpanu - Saapaanni Sahistu Kalvarikekkina Jeevaraajaa!
1)
Aascharyamaina Ee Preman Nenu Etlu Grahintunu
Nirmalamaina Ee Snehitamunu Etlu Teerchukondunu
Hrudayan Karigipoyindi - Ee Premajvaalache
Paapapu Bhaaramu Poyindi Dhanyudanaitinee Ee Ee Ee
|| Nannen ||
2)
Aisvaryavantudavaina Neevu - Naa Koraku Daaridryan Dhariyinchitivaa
Naa Kostran Dhariyinpa Mullakireetan - Dhariyinchitivaa Naa Aaptudaa
Nindavamaanamulanu Neevu - Ento Sahinchitivaa
Paapapu Saapapu Bhaaramunu - Nee Dehanlo Vahinchitivaa
Pavitramaina Nee Dehaanni Virachuta Koppitivaa
Amoolyamaina Nee Raktamun - Naa Koraku Chindinchitivaa
Aa..... Aa..... Aa.....
|| Nannen ||
3)
Golgotaraajavu, Naa Praana Priyudavu - Sthuthiki Yogyudavu
Neevokkadave - Tandri Chittaaniki Lobadi Vachchina Devuni Gorrevu
Neevenayaa, Saastrapu Maata Prakaaran Neevu - Siluvanekkitivaa,
Samaadhinundi Jeevanto Neevu Punarutthaanudavaitivi,
Tandri Kudivaipunakekkitivi Naa Vimochakudavu,
Bhoomiki Tirigi Vachchedavu - O Divya Rakshakudaa
Aa.... Aa.... Aa.....
|| Nannen ||
Present