తెలుగు శృంగార నగరమందు
పల్లవిశృంగార - నగరమందు - జయగీతముల్ పాడెదము - సీయోను - వరునిజేరి
1)ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందెదము
అచ్చట అలంకార మహిమ - కిరీటము పొంది
ప్రియునిలో హర్షించెదం
|| శృంగార ||
2)దుఃఖించువారు - స్తుతిపాట పాడుచు - స్తుతి వస్త్రములతో
అచ్చట - ఉన్నత సీయోను - తిన్నని వీధిలో
హర్షించి - స్తుతి పాడెదం
|| శృంగార ||
3)ముండ్లకిరీటము - పొందిన నిజయేసు - పరిశుద్ధుని చూతుము
అచ్చట ముద్రపొందిన - శుద్ధులు తెల్లంగి
ధరించి స్తోత్రించెదం
|| శృంగార ||
4)భూలోకపాలన - క్రొత్తపాట పాడి - ప్రేమలో హర్షించెదం
శాంతి సౌఖ్యంబుతోడ - ప్రభువుతో నుండ
భూ ఆశల్ విడుచుదము
|| శృంగార ||
5)ఆయన చెప్పిన గురుతులన్నియు - తప్పక జరుగుచుండె
ఆయన వచ్చు వేళ - తెలియదు ఎపుడో ఆయత్తముగానుందము
|| శృంగార ||
6)సిలువను మోసిన - పరిశుద్ధుడగు యేసు - చెంత చేరుకొందము
అచ్చట మచ్చా డాగులేని - ప్రభుని వెంబడించి
జయగీతములు పాడెదం
|| శృంగార ||
English Shrungaara Nagaramandu
ChorusSrngaara - Nagaramandu - Jayageetamul Paadedamu - Seeyonu - Varunijeri
1)Aanandamichchina Priyuni Cheri Aadarana Pondedamu
Achchata Alankaara Mahima - Kireetamu Pondi
Priyunilo Harshinchedan
|| Srngaara ||
2)DuHkhinchuvaaru - Sthuthipaata Paaduchu - Sthuthi Vastramulato
Achchata - Unnata Seeyonu - Tinnani Veedhilo
Harshinchi - Sthuthi Paadedan
|| Srngaara ||
3)Mundlakireetamu - Pondina Nijayesu - Parisuddhuni Chootumu
Achchata Mudrapondina - Suddhulu Tellangi
Dharinchi Stotrinchedan
|| Srngaara ||
4)Bhoolokapaalana - Krottapaata Paadi - Premalo Harshinchedam
Saanti Saukhyanbutoda - Prabhuvuto Nunda
Bhoo Aasal Viduchudamu
|| Srngaara ||
5)Aayana Cheppina Gurutulanniyu - Tappaka Jaruguchunde
Aayana Vachchu Vela - Teliyadu Epudo Aayattamugaanundamu
|| Srngaara ||
6)Siluvanu Mosina - Parisuddhudagu Yesu - Chenta Cherukondamu
Achchata Machchaa Daaguleni - Prabhuni Venbadinchi
Jayageetamulu Paadedan
|| Srngaara ||