తెలుగు నీ వెళ్ళు బాటలో పరలోక
పల్లవినీ వెల్గుబాటలో - పరలోక కాంతిలో - నడిపించు మమ్ము
వినిపించు మాకు - నీ తేనియ పలుకు
1)శుద్ధసువర్ణ మయమైన - పరిశుద్ధ పట్టణ వీధులలో
స్వచ్చమైన స్ఫటిక కాంతుల - స్వర్గవీధులలో
|| నీ ||
2)ధగ ధగ మెరయు నగరములో - సూర్యచంద్రుల వసరములేదు
దేదీప్యమైన ఓ గొఱ్ఱెపిల్ల - దీపంబె నీవై యుండగ
|| నీ ||
3)ఆకలిదప్పులు ఆవేదనలు - శోధన బాధలు లేవుగ
మరణమైన దుఃఖమైన - ఏ వేదనలు లేవుగ
|| నీ ||
4)జీవజల మయమైన నదులు - జీవజలముతో పారుచుండ
జీవవృక్షములు నెల నెల కాపులతో - జీవఫలముల నిచ్చుచుండ
|| నీ ||
5)అసహ్యమైనది ఏదియు - అన్యాయమైనది ఏదియు
అక్రమమైనదియు అబద్ధమైనదియు - ఏదియును లేనియచట
|| నీ ||
6)జనములు నీదు సన్నిధిలో - జిహ్వాఫలము లర్పించుచుండ
భూరాజులును తమ మహిమను కూడ - నీ పాదముల చెంత
జేర్చుచుండ
|| నీ ||
7)పరలోక దూతల సైన్యముల్ - పరమ గీతములు పాడుచుండ
హోసన్న నాదంబు వినిపించుచుండ - జోహారులర్పింతుము
|| నీ ||
English Nee Vellu Baatalo Paraloka
ChorusNee Velgubaatalo - Paraloka Kaantilo - Nadipinchu Mammu
Vinipinchu Maaku - Nee Teniya Paluku
1)Sudhasuvarna Mayamaina - Parisudha Pattana Veedhulalo
Svachchamaina Sphatika Kaantula - Svargaveedhulalo
|| Nee ||
2)Dhaga Dhaga Merayu Nagaramulo - Sooryachandrula Vasaramuledu
Dedeepyamaina O Gorrepilla - Deepanbe Neevai Yundaga
|| Nee ||
3)Aakalidappulu Aavedanalu - Sodhana Baadhalu Levuga
Maranamaina DuHkhamaina - e Vedanalu Levuga
|| Nee ||
4)Jeevajala Mayamaina Nadulu - Jeevajalamuto Paaruchunda
Jeevavrukshamulu Nela Nela Kaapulato - Jeevaphalamula Nichchuchunda
|| Nee ||
5)Asahyamainadi ediyu - Anyaayamainadi ediyu
Akramamainadiyu Abadhamainadiyu - ediyunu Leniyachata
|| Nee ||
6)Janamulu Needu Sannidhilo - Jihvaaphalamu Larpinchuchunda
Bhooraajulunu Tama Mahimanu Kooda - Nee Paadamula Chenta
Jerchuchunda
|| Nee ||
7)Paraloka Dootala Sainyamul - Parama Geetamulu Paaduchunda
Hosanna Naadanbu Vinipinchuchunda - Johaarularpintumu
|| Nee ||