తెలుగు పరలోక పట్టణము
పల్లవిపరలోక పట్టణము - పండ్రెండు గుమ్మములు
పండ్రెండు ముత్యములతో - పదిలముగా కట్టబడెన్
1)మండితంబగు పునాది - సూర్యకాంతపురాయి
రెండవది నీలము - మూడవది యమునారాయి
|| పర ||
2)పచ్చ వైఢూర్యము - కెంపు సువర్ణము
అచ్చ గోమేధికము - పుష్య రాగముతోడ
|| పర ||
3)పదియవది సునీయము - పదకొండు పద్మరాగము
పండ్రెండు సుగంధము - పండ్రెండు ముత్యములు
|| పర ||
4)శుద్ధ సువర్ణవీధుల్ - స్వచ్చమైన స్ఫటికము
సుందరంబుగనుండు - సిద్ధపడి రండి
|| పర ||
5)గొఱ్ఱెపిల్ల దీపం - సూర్యుడక్కరలేదు
భూరాజుల్ తమ మహిమన్ - తీసికొనివచ్చెదరు.
|| పర ||
6)జీవజలము నది - ప్రవహించుచుండెను
జీవంబుగల్లును - జీవించుదురు ప్రజలు
|| పర ||
7)ఇరుప్రక్కల నదికి - జీవ వృక్షముండె
పండ్రెండు నెలలకు - పండ్రెండు కాపులు కాయు
|| పర ||
English Paraloka Pattanamu
ChorusParaloka Pattanamu - Pandrendu Gummamulu
Pandrendu Mutyamulato - Padilamugaa Kattabaden
1)Manditanbagu Punaadi - Sooryakaantapuraayi
Rendavadi Neelamu - Moodavadi Yamunaaraayi
|| Para ||
2)Pachcha Vaidhooryamu - Kenpu Suvarnamu
Achcha Gomedhikamu - Pushya Raagamutoda
|| Para ||
3)Padiyavadi Suneeyamu - Padakondu Padmaraagamu
Pandrendu Sugandhamu - Pandrendu Mutyamulu
|| Para ||
4)Sudha Suvarnaveedhul - Svachchamaina Sphatikamu
Sundaranbuganundu - Sidhapadi Randi
|| Para ||
5)Gorrepilla Deepan - Sooryudakkaraledu
Bhooraajul Tama Mahiman - Teesikonivachchedaru.
|| Para ||
6)Jeevajalamu Nadi - Pravahinchuchundenu
Jeevanbugallunu - Jeevinchuduru Prajalu
|| Para ||
7)Iruprakkala Nadiki - Jeeva Vrukshamunde
Pandrendu Nelalaku - Pandrendu Kaapulu Kaayu
|| Para ||