తెలుగు స్తుతించెదను నిన్ను
పల్లవిస్తుతించెదను నిన్ను నేను మనసారా - భజించెదను నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభూ - సమస్తము నీ కర్పించెదను
1)పూజార్హుడవు పవిత్రుడవు - పాపిని క్షమించె మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చే - పావనుడగు మా ప్రభువు నీవే
|| స్తుతి ||
2)కృపా కనికరములు గల దేవా - కరుణ జూపి కనికరించు
కంటి రెప్పవలె కాపాడు - కడవరకు మమ్ము కాయుమయా
|| స్తుతి ||
3)సర్వశక్తిగల మా ప్రభువా - సజీవ సాక్షిగ చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరచుము - సదా నీకే స్తోత్రాలర్పింతున్
|| స్తుతి ||
English Sthuthimchedanu Ninnu
ChorusSthuthinchedanu Ninnu Nenu Manasaaraa - Bhajinchedanu Nenu Ninnu Dinadinamu
Stotraarhudavu Neeve Prabhoo - Samastamu Nee Karpinchedanu
1)Poojaarhudavu Pavitrudavu - Paapini Kshaminche Mitrudavu
Paramu Cherchi Phalamulichche - Paavanudagu Maa Prabhuvu Neeve
|| Sthuthi ||
2)Krupaa Kanikaramulu Gala Devaa - Karuna Joopi Kanikarinchu
Kanti Reppavale Kaapaadu - Kadavaraku Mammu Kaayumayaa
|| Sthuthi ||
3)Sarvasaktigala Maa Prabhuvaa - Sajeeva Saakshiga Cheyumayaa
Sthiraparachi Mammu Balaparachumu - Sadaa Neeke Stotraalarpintun
|| Sthuthi ||