తెలుగు సుందరవతి సంఘమా
పల్లవిసుందరవతి సంఘమా - ప్రియుడేసునిన్
పరిణయ మాడగ - రానుండెన్ (3 సార్లు)
విడుదల కలుగును - వేచి యుండుము
నీ ప్రియ వరుడు - అరుదెంచునుగా
1)తొలిగించుము నీ రాతిరి - వలువలు
ధరియించుము నీ - దివ్యాంబరములు
మురియును నీ ప్రభు - నిన్ను చూడను
కురిపించును తన కృప దీవెనలు
|| సుందర ||
2)విందువు బూరల - మంగళ ధ్వనులు
కందువు యేసుని - సుందర రూపము
విందులో నీవు - పాల్గొందెదవు
డెందము సంతస - మొందెదవు నిజము
|| సుందర ||
3)అరుదెంచునుగా మేఘ రధములు
పరమండలపు - పయనము చేయ
వరుడగు క్రీస్తుని - సరసన చేరి
పరవశమొంది - ప్రణమిల్లెదవు
|| సుందర ||
4)మహిమ స్వరూపము - దాల్తువు నీవు
మహిమాన్వితుని - పోలియుందువు
బహుమతులెన్నో - దాచెను నీకై
సహనము వీడకు - రాజకుమారి
|| సుందర ||
English Sundaravathi Sanghamaa
ChorusSundaravati Sanghamaa - Priyudesunin
Parinaya Maadaga - Raanunden (3 Saarlu)
Vidudala Kalugunu - Vechi Yundumu
Nee Priya Varudu - Arudenchunugaa
1)Toliginchumu Nee Raatiri - Valuvalu
Dhariyinchumu Nee - Divyaanbaramulu
Muriyunu Nee Prabhu - Ninnu Choodanu
Kuripinchunu Tana Krupa Deevenalu
|| Sundara ||
2)Vinduvu Boorala - Mangala Dhvanulu
Kanduvu Yesuni - Sundara Roopamu
Vindulo Neevu - Paalgondedavu
Dendamu Santasa - Mondedavu Nijamu
|| Sundara ||
3)Arudenchunugaa Megha Radhamulu
Paramandalapu - Payanamu Cheya
Varudagu Kreestuni - Sarasana Cheri
Paravasamondi - Pranamilledavu
|| Sundara ||
4)Mahima Svaroopamu - Daaltuvu Neevu
Mahimaanvituni - Poliyunduvu
Bahumatulenno - Daachenu Neekai
Sahanamu Veedaku - Raajakumaari
|| Sundara ||