తెలుగు మేలుకొనుము ఓ సోదరుడా
పల్లవిమేలుకొనుము - ఓ సోదరుడా!
ప్రభువు రాకడ యిదె - రానుండెన్
1)జాలము చేసెడి - కాలము గాదురా ! నీవిటు - యోచింపుమురా
ప్రతి నేత్రము - ప్రభుని జూచున్ ఆ\...
పొడిచిన వారును - చూచెదరు
|| మేలు ||
2)నింగి ఆకసమున - మెండగు దూతలు - బూర ధ్వనితో - దిగివచ్చున్
మనుష్య కుమారుని - జూచి ఆ\...
భూజనులెల్లరు - కూలెదరు
|| మేలు ||
3)జనముల మీదికి - జనములు లేచున్ - రాజ్యములే - కలవర మొందున్
కరువులు, భూకంపములు ఆ\...
పెల్లుగ భువిపై - మొదలిడును
|| మేలు ||
4)ఆ దినమెవరికి - తెలియగ రాదు - దూతలు, జ్ఞాను - లెరుగరు
ఏ ఝామునో ప్రభు - డొచ్చున్ ఆ\...
ఎవరికి తెలియదు - సోదరుడా !
|| మేలు ||
5)ఆశీర్వదింప - బడినవారు పరమునకెత్త - బడెదరు
శాశ్వత - జీవము పొంది ఆ\...
పావన ప్రభుని - స్తుతించెదరు
|| మేలు ||
6)పాపులు అగ్ని - గుండములోబడి - నిత్యము - శోకించెదరు
సిద్ధపడుము - ఓ ప్రియుడా ! ఆ\...
శాశ్విత రాజ్యము - ప్రభువిచ్చున్
|| మేలు ||
English Melukonumu O Sodarudaa
ChorusMelukonumu - O Sodarudaa!
Prabhuvu Raakada Yide - Raanunden
1)Jaalamu Chesedi - Kaalamu Gaaduraa ! Neevitu - Yochinpumuraa
Prati Netramu - Prabhuni Joochun Aa\...
Podichina Vaarunu - Choochedaru
|| Melu ||
2)Ningi Aakasamuna - Mendagu Dootalu - Boora Dhvanito - Digivachchun
Manushya Kumaaruni - Joochi Aa\...
Bhoojanulellaru - Kooledaru
|| Melu ||
3)Janamula Meediki - Janamulu Lechun - Raajyamule - Kalavara Mondun
Karuvulu, Bhookanpamulu Aa\...
Pelluga Bhuvipai - Modalidunu
|| Melu ||
4)Aa Dinamevariki - Teliyaga Raadu - Dootalu, Gnaanu - Lerugaru
e Jhaamuno Prabhu - Dochchun Aa\...
Evariki Teliyadu - Sodarudaa !
|| Melu ||
5)Aaseervadinpa - Badinavaaru Paramunaketta - Badedaru
Saasvata - Jeevamu Pondi Aa\...
Paavana Prabhuni - Sthuthinchedaru
|| Melu ||
6)Paapulu Agni - Gundamulobadi - Nityamu - Sokinchedaru
Sidhapadumu - O Priyudaa ! Aa\...
Saasvita Raajyamu - Prabhuvichchun
|| Melu ||