తెలుగు అంత్య దినములలో
పల్లవిఅంత్య దినములలో - అపాయకరమైన కాలములు వచ్చును
1)మనుష్యులు స్వార్ధప్రియులౌదురు - ధనాపేక్షులు
బింకములాడుచు - అహంకారులు - ధూషకులౌదురు
తల్లిదండ్రుల కవిధేయులయి కృతజ్ఞతలేని వారౌదురు
|| అంత్య ||
2)అపవిత్రులనురాగ రహితులు - అతిద్వేషులు - అపవాదకులు
అజితేంద్రియులును క్రూరులయి - సజ్జనద్వేషులు
ద్రోహులయి - మూర్ఖులు గర్వాందులై యుందురు
|| అంత్య ||
3)దేవునికంటె సుఖము - నెక్కువగ - ప్రేమించిన వారెందరో
యుందురు - పైపైకి భక్తిగా నటియించుచు - దేవుని శక్తి
నాశ్రయించరు - వీరికి విముఖడవై యుండుము
|| అంత్య ||
4)ఏ దినమో - ఏ క్షణమో ఈ అంత్యము - తండ్రికేగా కెవ్వరికి
తెలియదు - ఎల్లప్పుడు సిద్ధమనస్సుగల - విశ్వాసివై యుండు
విధినీదేగా - గమనించి నీ జీవితము గడుపుకో
|| అంత్య ||
English Antya Dinamulalo
ChorusAntya Dinamulalo - Apaayakaramaina Kaalamulu Vachchunu
1)Manushyulu Svaardhapriyulauduru - Dhanaapekshulu
Binkamulaaduchu - Ahankaarulu - Dhooshakulauduru
Tallidandrula Kavidheyulayi Krutagnaataleni Vaarauduru
|| Antya ||
2)Apavitrulanuraaga Rahitulu - Atidveshulu - Apavaadakulu
Ajitendriyulunu Kroorulayi - Sajjanadveshulu
Drohulayi - Moorkhulu Garvaandulai Yunduru
|| Antya ||
3)Devunikante Sukhamu - Nekkuvaga - Preminchina Vaarendaro
Yunduru - Paipaiki Bhaktigaa Natiyinchuchu - Devuni Sakti
Naasrayincharu - Veeriki Vimukhadavai Yundumu
|| Antya ||
4)e Dinamo - e Kshanamo Ee Antyamu - Tandrikegaa Kevvariki
Teliyadu - Ellappudu Sidhamanassugala - Visvaasivai Yundu
Vidhineedegaa - Gamaninchi Nee Jeevitamu Gadupuko
|| Antya ||