తెలుగు మరణాత హల్లేలూయా
పల్లవిమరనాథ హల్లెలూయ - యేసునాథ హల్లెలూయ
ప్రాణనాథ హల్లెలూయ - తరలిరమ్ము యేసునాథ
1)అద్వితీయ ప్రభువా - నీ ద్వితీయ ఆగమనం
అది ఎంతో అద్భుతము - ఆహా మాకెంతో ఆనందము
|| మరనాథ ||
2)సంఘమను మందిరమును - బహుసుందరంగ కట్టుచుంటివి
అందులో నన్నుకూడ - ఒకరాయిగా చెక్కియుంటివి
|| మరనాథ ||
3)నేర్పరియగు శిల్పివి - మార్పులేనివాడవే
కాపరివగుదేవుడ - అర్పింతు సర్వస్వము
|| మరనాథ ||
4)నీ రాక సూచనలు - అనేకంబు జరుగుచుండె
నీరాకకై ఎదురు - చూచెడి ఓర్పునిమ్ము
|| మరనాథ ||
5)పాడెదను మరనాథ - మరి వేడెదను మరనాథ
చాటెదను మరనాథ - మరి మీటెదను మరనాథ
|| మరనాథ ||
English Maranaata Halleluyaa
ChorusMaranaatha Hallelooya - Yesunaatha Hallelooya
Praananaatha Hallelooya - Taralirammu Yesunaatha
1)Adviteeya Prabhuvaa - Nee Dviteeya Aagamanam
Adi Ento Adbhutamu - Aahaa Maakento Aanandamu
|| Maranaatha ||
2)Sanghamanu Mandiramunu - Bahusundaranga Kattuchuntivi
Andulo Nannukooda - Okaraayigaa Chekkiyuntivi
|| Maranaatha ||
3)Nerpariyagu Silpivi - Maarpulenivaadave
Kaaparivagudevuda - Arpintu Sarvasvamu
|| Maranaatha ||
4)Nee Raaka Soochanalu - Anekanbu Jaruguchunde
Neeraakakai Eduru - Choochedi Orpunimmu
|| Maranaatha ||
5)Paadedanu Maranaatha - Mari Vededanu Maranaatha
Chaatedanu Maranaatha - Mari Meetedanu Maranaatha
|| Maranaatha ||