తెలుగు సంఘు వధువా ప్రియుడేసునికై
పల్లవిసంఘవధువా - ప్రియుడేసునికై - సంసిద్ధమైనావా! నీవు - సంసిద్ధమైనవా?
1)వరుడు యేసుని వివాహమాడ - మురియుచున్నావా? ఆత్మవరుని
స్మరణే నీకు - ఆనందమాయెనా? - మహ - దానందమాయెనా?
|| సంఘ ||
2)తీర్సా యెరూషలేము - నగరాల - తీరుయున్నదా! వ్యూహిత సైన్య - సమ
భీకరమగు - సాహసమున్నదా? - నీకు - సాహసమున్నదా!
|| సంఘ ||
3)పావురమా! నీ పెదవులు తేనియ - లొలుకుచున్నవా! పాలు తేనెలు
జిహ్వ క్రింద - ఉబుకుచున్నవా! తేనియ - లుబుకుచున్నవా?
|| సంఘ ||
4)ప్రభుని లోపర్చుకొను కన్ను - నీకు ఉన్నదా! ప్రభుని ఆకర్షించెడి
హారము - ధరించుకొన్నావా! హారము - ధరించుకొన్నావా
|| సంఘ ||
5)విచ్చిన దాడిమఫలమువలె నీ - కణతలున్నవా! ముసుగుద్వారా
నీ సొగసును యేసు - చూచుచున్నాడా! ప్రియుడు - చూచుచున్నాడా!
|| సంఘ ||
6)తాళవృక్షమువలే చక్కని - దానవైనావా! ద్రాక్షగెల లందము
నీ తనువు - దాల్చియున్నదా! - తనువు - దాల్చియున్నాదా!
|| సంఘ ||
7)వరుడు యేసు ఈ దినమందే - వచ్చినట్లయితే - నగవుతో నూతన
శక్తిగల్గి - ఎగిరి పోగలవా! - నీవు - ఎగిరి పోగలవా?
|| సంఘ ||
English Sanghu Vadhuva Priyudesunikai
ChorusSanghavadhuvaa - Priyudesunikai - Sansidhamainaavaa! Neevu -\nSansidhamainavaa?
1)Varudu Yesuni Vivaahamaada - Muriyuchunnaavaa? Aatmavaruni\nSmarane Neeku - Aanandamaayenaa? - Maha - Daanandamaayenaa?
2)Teersaa Yerooshalemu - Nagaraala - Teeruyunnadaa! Vyoohita Sainya -\nSama\nBheekaramagu - Saahasamunnadaa? - Neeku - Saahasamunnadaa!
3)Paavuramaa! Nee Pedavulu Teniya - Lolukuchunnavaa! Paalu Tenelu\nJihva Krinda - Ubukuchunnavaa! Teniya - Lubukuchunnavaa?
4)Prabhuni Loparchukonu Kannu - Neeku Unnadaa! Prabhuni Aakarshinchedi\nHaaramu - Dharinchukonnaavaa! Haaramu - Dharinchukonnaavaa
5)Vichchina Daadimaphalamuvale Nee - Kanatalunnavaa! Musugudvaaraa\nNee Sogasunu Yesu - Choochuchunnaadaa! Priyudu - Choochuchunnaadaa!
6)Taalavrukshamuvale Chakkani - Daanavainaavaa! Draakshagela Landamu\nNee Tanuvu - Daalchiyunnadaa! - Tanuvu - Daalchiyunnaadaa!
7)Varudu Yesu Ee Dinamande - Vachchinatlayite - Nagavuto Nootana\nSaktigalgi - Egiri Pogalavaa! - Neevu - Egiri Pogalavaa?