Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 758 Old No: 183

కడబూర శబ్దంబుతేను

Kadaboora Shabdambuthenu

Open in Word & Worship App
తెలుగు   కడబూర శబ్దంబుతేను
పల్లవి
కడబూర శబ్దంబుతోను - దూతల శబ్దంబుతోను
పరలోకమునుండి వచ్చును - ప్రభుయేసు - మేఘముపై వచ్చును
1)
సిద్ధపడి యుంటేనే మెప్పు లేకుంటే మరి నీకు ముప్పు
సంతోషముతో సత్యుని పొందు ఆనందముతో మేలు నొందు
|| కడు ||
2)
నూనె నీ దీపములో ఉందా? - ఉందో లేదో నేడే చూడు
నేడైన యేసుని అడిగి - నూనెతో నింపబడు ప్రియుడా
|| కడు ||
3)
సూచన లెన్నో జరుగుచునుండె - యూదులు కూడినారయ్యా
యుద్ధములు కలహములు ఎన్నో - కలుగుచుండెను
కనుగొనుమయ్యా
|| కడు ||
4)
రక్తము కార్చిన క్రీస్తు - రయముగా రానుండె సోదరుడా
రాజులకు రాజైన ప్రభువు - రమ్యముగా రాజ్యంబు నేలన్‌
|| కడు ||
5)
మరణించి లేచే నీ ప్రభువు - మృతుడవైన నిన్ను లేపన్‌
మృత్యుంజయుని విశ్వసించు - మహిమలో నేడే నిను చేర్చు
|| కడు ||
6)
త్వరగా రానున్నాడు యేసు - త్వరితముగా తయ్యారగుమా
త్వరితముగా సిద్ధపడనిచో - త్రోయబడెదవు నరకములో
|| కడు ||
7)
త్వరపడుము ప్రియుడా ఓ యేసూ - లఘువైన - ఇట్టివలెనుండు
గంతులు వేయుచు రమ్ము - లేడిపిల్లవలె నుండు
|| కడు ||
English   Kadaboora Shabdambuthenu
Chorus
Kadaboora Sabdanbutonu - Dootala Sabdanbutonu
Paralokamunundi Vachchunu - Prabhuyesu - Meghamupai Vachchunu
1)
Sidhapadi Yuntene Meppu Lekunte Mari Neeku Muppu
Santoshamuto Satyuni Pondu Aanandamuto Melu Nondu
|| Kadu ||
2)
Noone Nee Deepamulo Undaa? - Undo Ledo Nede Choodu
Nedaina Yesuni Adigi - Nooneto Ninpabadu Priyudaa
|| Kadu ||
3)
Soochana Lenno Jaruguchununde - Yoodulu Koodinaarayyaa
Yudhamulu Kalahamulu Enno - Kaluguchundenu
Kanugonumayyaa
|| Kadu ||
4)
Raktamu Kaarchina Kreestu - Rayamugaa Raanunde Sodarudaa
Raajulaku Raajaina Prabhuvu - Ramyamugaa Raajyanbu Nelan
|| Kadu ||
5)
Maraninchi Leche Nee Prabhuvu - Mrtudavaina Ninnu Lepan
Mrtyunjayuni Visvasinchu - Mahimalo Nede Ninu Cherchu
|| Kadu ||
6)
Tvaragaa Raanunnaadu Yesu - Tvaritamugaa Tayyaaragumaa
Tvaritamugaa Sidhapadanicho - Troyabadedavu Narakamulo
|| Kadu ||
7)
Tvarapadumu Priyudaa O Yesoo - Laghuvaina - Ittivalenundu
Gantulu Veyuchu Rammu - Ledipillavale Nundu
|| Kadu ||
Present