Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 755 Old No: 180

యేసురాజగా వచ్చుచున్నాడు

Yesurajagaa Vaccuchunnaadu

Open in Word & Worship App
తెలుగు   యేసురాజగా వచ్చుచున్నాడు
పల్లవి
యేసు రాజుగా వచ్చుచున్నాడు - భూలోకమంత తెలుసుకుంటారు
రవికోటి తేజుడూ - రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చుచున్నాడు
1)
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు
లోకమంతా శ్రమకాలం - విడువబడుట బహు ఘోరం
|| యేసు ||
2)
ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతోంది
ఏడేండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది
ఈ సువార్త మూయబడున్‌ - వాక్యమే కరవగును
|| యేసు ||
3)
వెయ్యేండ్లు యిలపై యేసు రాజ్య మేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన యేలును
నీతిశాంతి వర్ధిల్లును - న్యాయమే కనబడును
|| యేసు ||
4)
ఈ లోక దేవతలంతా - ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడాలి
వంగని మోకాళ్ళన్ని - యేసయ్య యెదుట వంగిపోవును
|| యేసు ||
English   Yesurajagaa Vaccuchunnaadu
Chorus
Yesu Raajugaa Vachchuchunnaadu - Bhoolokamanta Telusukuntaaru
Ravikoti Tejudoo - Ramyamaina Devudu - Raaraajugaa Vachchuchunnaadu
1)
Meghaalameeda Yesu Vachchuchunnaadu
Parisuddhulandarini Teesukupotaadu
Lokamantaa Sramakaalan - Viduvabaduta Bahu Ghoran
|| Yesu ||
2)
edendlu Parisuddhulaku Vindavabotondi
edendlu Lokan Meedaku Srama Raabotundi
Ee Suvaarta Mooyabadun - Vaakyame Karavagunu
|| Yesu ||
3)
Veyyendlu Yilapai Yesu Raajya Melunu
Ee Loka Raajyaalanni Aayana Yelunu
Neetisaanti Vardhillunu - Nyaayame Kanabadunu
|| Yesu ||
4)
Ee Loka Devatalantaa - Aayana Mundara
Saagilapadi Namaskarinchi Gadagadalaadaali
Vangani Mokaallanni - Yesayya Yeduta Vangipovunu
|| Yesu ||
Present