తెలుగు మన బలమైన దేవాది దేవుని
పల్లవిమన బలమైన దేవాది దేవుని రాజ్యము - సమీపమౌచున్నది
తన కృపకాలము అతి త్వరితముగా యిల - గతించనైయున్నది
1)ఆకలి దప్పులుండవచ్చట - వ్యాధి బాధలు లేవచ్చట
విలాపమునకు రోధనధ్వనులకును - తావులేదచ్చట
|| మన ||
2)సంతోష సునాదములు - నీతి సమాధానములు
ఆ రాజ్యమునకు ఆధారములై - అవినిలుచు కలకాలం
|| మన ||
3)అక్షయ రాజ్యమునీయ - రక్షకుడే నిను పిలువ
తక్షణమాయన సైన్యములో చేరి - సాగిపోయెదవా!
|| మన ||
4)ప్రభు త్వరగా వచ్చును - తన రాజ్యమునకు చేర్చున్
ప్రార్థనలో పవిత్రతతో మనము - కనిపెట్టియుందము
|| మన ||
English Mana Balamaina Devaadi Devuni
ChorusMana Balamaina Devaadi Devuni Raajyamu - Sameepamauchunnadi
Tana Krupakaalamu Ati Tvaritamugaa Yila - Gatinchanaiyunnadi
1)Aakali Dappulundavachchata - Vyaadhi Baadhalu Levachchata
Vilaapamunaku Rodhanadhvanulakunu - Taavuledachchata
|| Mana ||
2)Santosha Sunaadamulu - Neeti Samaadhaanamulu
Aa Raajyamunaku Aadhaaramulai - Aviniluchu Kalakaalan
|| Mana ||
3)Akshaya Raajyamuneeya - Rakshakude Ninu Piluva
Takshanamaayana Sainyamulo Cheri - Saagipoyedavaa!
|| Mana ||
4)Prabhu Tvaragaa Vachchunu - Tana Raajyamunaku Cherchun
Praarthanalo Pavitratato Manamu - Kanipettiyundamu
|| Mana ||