Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 75 Old No: 762

మరపురాని నీ ప్రేమను

Marapuraani Nee Premanu

♪ Vajragiri Joseph
Open in Word & Worship App
తెలుగు   మరపురాని నీ ప్రేమను
పల్లవి
మరపురాని నీ ప్రేమను నే - స్మరింతునులే నా దేవుండా!
కరుణజూపి వధువు కొఱకే - తనువు దానంబు జేసితివా!
1)
ఈ జగతిని నీవే సృష్టించి - ఈ జగతిని నీవే పోషించి
కరుణ జూపి కాపాడితివి - స్వరమునెత్తి స్తుతించెదను
|| మ ||
2)
అశాశ్వతమైన బ్రతుకునకు - నీ శాశ్వత జీవమిచ్చితివే
మృత్యుంజయుడా! విమోచకుడా ! - మోక్షరాజ్యాధి పాలకుడా!
|| మ ||
3)
శ్రమలు యెన్నెన్నో నను జుట్టి - క్రమము దప్పించి బాధింపన్‌
శ్రమలు నాతో భరించునే - శాంతి సౌఖ్యాలు కలిగించెన్‌
|| మ ||
4)
మహోన్నతమైన దేవుండా! మహోన్నత రాజ్యపాలకుడా!
మహిమ ఘనత ప్రభావములు - నీకె కలుగున్‌ హల్లెలూయ
|| మ ||
English   Marapuraani Nee Premanu
Chorus
Marapuraani Nee Premanu Ne - Smarintunule Naa Devundaa!
Karunajoopi Vadhuvu Korake - Tanuvu Daananbu Jesitivaa!
1)
Ee Jagatini Neeve Srushtinchi - Ee Jagatini Neeve Poshinchi
Karuna Joopi Kaapaaditivi - Svaramunetti Sthuthinchedanu
|| Ma ||
2)
Asaasvatamaina Bratukunaku - Nee Saasvata Jeevamichchitive
Mrtyunjayudaa! Vimochakudaa ! - Moksharaajyaadhi Paalakudaa!
|| Ma ||
3)
Sramalu Yennenno Nanu Jutti - Kramamu Dappinchi Baadhinpan
Sramalu Naato Bharinchune - Saanti Saukhyaalu Kaliginchen
|| Ma ||
4)
Mahonnatamaina Devundaa! Mahonnata Raajyapaalakudaa!
Mahima Ghanata Prabhaavamulu - Neeke Kalugun Hallelooya
|| Ma ||
Present