Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 748 Old No: 173

ఇదిగో మీరాజ ఎతెంచు

Idigo Meeraaja Etenchu

Open in Word & Worship App
తెలుగు   ఇదిగో మీరాజ ఎతెంచు
పల్లవి
ఇదిగో మీరాజు ఏతెంచుచున్నాడు మీ తల లెత్తుడి
సమీపమాయె మీ విడుదల ధైర్యము నొందుడి
1)
యుద్ధములు కలహములు వైరములు నిందలు హింసలు
అపవాదులు అంతమునకు సూచనలివే మేల్కొని యుండుడి
|| ఇదిగో ||
2)
అక్రమము అవినీతి ప్రబలుచు అందరి ప్రేమలు
చల్లారెను అంతము వరకు కాపాడుకొమ్ము మొదటి ప్రేమను
|| ఇదిగో ||
3)
చిగురించుచున్నది అంజూరము ఏతెంచియున్నది వసంతము
ఉరివచ్చినట్లు నమ్మనివారికి అంతము వచ్చును
|| ఇదిగో ||
4)
ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు మత్తును చింతను వీడుమా
విశ్వాస ప్రేమ నిరీక్షణంబు ధరించియుండుము
|| ఇదిగో ||
English   Idigo Meeraaja Etenchu
Chorus
Idigo Meeraaju etenchuchunnaadu Mee Tala Lettudi
Sameepamaaye Mee Vidudala Dhairyamu Nondudi
1)
Yudhamulu Kalahamulu Vairamulu Nindalu Hinsalu
Apavaadulu Antamunaku Soochanalive Melkoni Yundudi
|| Idigo ||
2)
Akramamu Avineeti Prabaluchu Andari Premalu
Challaarenu Antamu Varaku Kaapaadukommu Modati Premanu
|| Idigo ||
3)
Chigurinchuchunnadi Anjooramu etenchiyunnadi Vasantamu
Urivachchinatlu Nammanivaariki Antamu Vachchunu
|| Idigo ||
4)
Ellappudu Praarthana Cheyuchu Mattunu Chintanu Veedumaa
Visvaasa Prema Nireekshananbu Dharinchiyundumu
|| Idigo ||
Present