Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 747 Old No: 172

అనుకోని గడియలో

Anukoni Gadiyalo

Open in Word & Worship App
తెలుగు   అనుకోని గడియలో
పల్లవి
అనుకోని ఘడియలో - ఆ ప్రభువే వచ్చును
అందరికి తగిన జీతము - ఆయనే తెచ్చును
1)
దీనమనస్సును కలిగుండుడి - మీ దీపములను వెలుగనీయుడి
ప్రభువు వచ్చును పరమునుండి - తట్టగానే తలుపు తీయుడి
|| ఆ ||
2)
మేల్కొని యుండుడి - మంద మతులై యుండకుడి
ప్రభువు వచ్చును ఎదురుచూచిన - దాసులను ధన్యులుగ చేయును
|| ఆ ||
3)
ధన్యులైన దాసులను - విందున ఆసీనుల చేయును
ప్రభువే జీవాహారమై యుండి - తానే ఉపచారంబు చేయును
|| ఆ ||
4)
తినుచు త్రాగుచు తిరుగకుమా - తరుణమిదే పిలుపును వినుమా
ప్రభురక్షణను గుర్తెరుగుమా - ఎదురుతిరిగి నశియింపకుమా
|| ఆ ||
English   Anukoni Gadiyalo
Chorus
Anukoni Ghadiyalo - Aa Prabhuve Vachchunu
Andariki Tagina Jeetamu - Aayane Techchunu
1)
Deenamanassunu Kaligundudi - Mee Deepamulanu Veluganeeyudi
Prabhuvu Vachchunu Paramunundi - Tattagaane Talupu Teeyudi
|| Aa ||
2)
Melkoni Yundudi - Manda Matulai Yundakudi
Prabhuvu Vachchunu Eduruchoochina - Daasulanu Dhanyuluga Cheyunu
|| Aa ||
3)
Dhanyulaina Daasulanu - Vinduna Aaseenula Cheyunu
Prabhuve Jeevaahaaramai Yundi - Taane Upachaaranbu Cheyunu
|| Aa ||
4)
Tinuchu Traaguchu Tirugakumaa - Tarunamide Pilupunu Vinumaa
Prabhurakshananu Gurterugumaa - Edurutirigi Nasiyinpakumaa
|| Aa ||
Present