తెలుగు అపరాధిని యేసయ్యా
పల్లవిఅపరాధిని యేసయ్యా - కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో - నరపరాధములను క్షమించు
1)సిలువకు నిను గొట్టితిని - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా
|| అప ||
2)ప్రక్కలో బల్లెపు పోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యా
|| అప ||
3)ముళ్లతో కిరీటంబు - నల్లి నీశిరమున నిడితి
నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రి
|| అప ||
4)దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని - దేహంబు గాయంబులను
|| అప ||
5)ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా
|| అప ||
6)చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బల చేత
నిందల పెట్టితినయ్యా - సందేహమేలనయ్యా
|| అప ||
7)శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య - మోక్షంబు జూపితివయ్యా
|| అప ||
English Aparaadhini Yesayya
ChorusAparaadhini Yesayyaa - Krupajoopi Brovumayyaa
Nepamenchakaye Nee Krupalo - Naraparaadhamulanu Kshaminchu
1)Siluvaku Ninu Gottitini - Tuluvalato Jeritini
Kalushanbulanu Mopitini - Doshunda Nenu Prabhuvaa
|| Apa ||
2)Prakkalo Ballepu Potu - Grakkuna Podichiti Nene
Mikkili Baadhinchitini - Makkuva Joopitivayyaa
|| Apa ||
3)Mullato Kireetanbu - Nalli Neesiramuna Niditi
Naa Valla Neramaaye - Challani Dayagala Tandri
|| Apa ||
4)Daahanbu Gonagaa Chedu - Chirakanu Draavaniditi
Drohundanai Jesitini - Dehanbu Gaayanbulanu
|| Apa ||
5)Ghoranbugaa Dooritini - Neranbulanu Jesitini
Kroorundanai Gottitini - Ghoranpu Paapini Devaa
|| Apa ||
6)Chinditi Raktamu Naakai - Pondina Debbala Cheta
Nindala Pettitinayyaa - Sandehamelanayyaa
|| Apa ||
7)Sikshaku Paatrudanayyaa - Rakshana Dechchitivayyaa
Akshaya Bhaagyamu Niyya - Mokshanbu Joopitivayyaa
|| Apa ||