తెలుగు పాపిని కృపజూవయయ్యా
పల్లవిపాపిని కృపజూవవయ్యా - దాపు జేరితిని యేసయ్యా
పాప భారము క్రింద శ్రమపడి - కృంగియున్నాను యేసయ్యా
1)వేష భాషలతోడ నిండి - మోసపోతిని యేసయ్యా దోసిలొగ్గి
నిన్ను చేరితి - దాసునిగ బ్రోవు యేసయ్యా
|| పాపి ||
2)నీతిలేని నాదు జీవిత - మేలు నికనయ్యా యేసయ్యా - నీతి గరిపి
బ్రోవుమయ్యా - నీతి నిడవయ్యా యేసయ్యా
|| పాపి ||
3)నీదు సిలువలోని ప్రేమ - నెంచదర మౌన? యేసయ్యా - నాదు
కలుషమంత బాపి - కనికరింపు మా యేసయ్యా
|| పాపి ||
4)నీదు రక్తధారలేయిల - పాపికాశ్రయము యేసయ్యా
నీతి మంతుల జేయుమయ్యా - నీతిసూర్యుండా యేసయ్యా
|| పాపి ||
5)దాపుగోరిన వారలకు నీ - ప్రాపు జూపితివి యేసయ్యా పాపశాపము
బాపి నిత్య - జీవమిడవయ్యా యేసయ్యా
|| పాపి ||
6)శాంతిగోరువార లెల్ల నీ - చెంతకరిగినచో యేసయ్యా - చింతలెల్ల
దీర్చగలవు - శాంతి నొసగెదవు యేసయ్యా
|| పాపి ||
7)పరమరక్షక నీదు ప్రేమ - నెరుగ తరమౌన ? యేసయ్యా
పరుల మైన మమ్ము బ్రోవ - వేచియున్నావా యేసయ్యా
|| పాపి ||
8)నాదు హృదయము నీదేసుమా - నీవె గైకొనుమా యేసయ్యా
శుద్ధ హృదయము జేసి నను నీ - సుతుని గాజేయు యేసయ్యా
|| పాపి ||
English Paapini Krupajoovayayya
ChorusPaapini Krupajoovavayyaa - Daapu Jeritini Yesayyaa
Paapa Bhaaramu Krinda Sramapadi - Krngiyunnaanu Yesayyaa
1)Vesha Bhaashalatoda Nindi - Mosapotini Yesayyaa Dosiloggi
Ninnu Cheriti - Daasuniga Brovu Yesayyaa
|| Paapi ||
2)Neetileni Naadu Jeevita - Melu Nikanayyaa Yesayyaa - Neeti Garipi
Brovumayyaa - Neeti Nidavayyaa Yesayyaa
|| Paapi ||
3)Needu Siluvaloni Prema - Nenchadara Mauna? Yesayyaa - Naadu
Kalushamanta Baapi - Kanikarinpu Maa Yesayyaa
|| Paapi ||
4)Needu Raktadhaaraleyila - Paapikaasrayamu Yesayyaa
Neeti Mantula Jeyumayyaa - Neetisooryundaa Yesayyaa
|| Paapi ||
5)Daapugorina Vaaralaku Nee - Praapu Joopitivi Yesayyaa Paapasaapamu
Baapi Nitya - Jeevamidavayyaa Yesayyaa
|| Paapi ||
6)Saantigoruvaara Lella Nee - Chentakariginacho Yesayyaa - Chintalella
Deerchagalavu - Saanti Nosagedavu Yesayyaa
|| Paapi ||
7)Paramarakshaka Needu Prema - Neruga Taramauna ? Yesayyaa
Parula Maina Mammu Brova - Vechiyunnaavaa Yesayyaa
|| Paapi ||
8)Naadu Hrudayamu Needesumaa - Neeve Gaikonumaa Yesayyaa
Sudha Hrudayamu Jesi Nanu Nee - Sutuni Gaajeyu Yesayyaa
|| Paapi ||