Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 742 Old No: 382

పాపిని నేను తప్తితి

Paapini Nenu Thaptithi

Open in Word & Worship App
తెలుగు   పాపిని నేను తప్తితి
పల్లవి
పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు
ఓ ప్రభు యేసు నిరీక్షణతో - నీ దరికి జేరితిని
1)
ప్రభువా పాపిని రక్షించుటకు - ఈ భువి కరుదెంచితివి
దౌర్భాగ్యుడను వేడితి శరణం - వేరేమి చేయలేను
|| పాపి ||
2)
జీవము నివ్వ వచ్చితివి - చచ్చి యుంటిని నేను
బంధింపబడితిని మరణ బంధములో - విడిపించెడి వారెవరు
|| పాపి ||
3)
జన్మముతోనే అపవిత్రడను - నా స్వభావమే పాపం
క్రియలలోను మాటలయందు - నీకు విరోధినైతిని
|| పాపి ||
4)
స్వంత నీతితో నిండిన పనులు - మరి పుణ్యకార్యములు
ఆచారములో చిక్కుకొన్నాను - తప్పించెడి వారెవరు
|| పాపి ||
5)
భరియించితివి పాపపు శిక్ష - ప్రాణమిచ్చితివి నాకై
రక్తము కార్చి సర్వమిచ్చితివి - నన్ను రక్షించుటకై
|| పాపి ||
6)
ఓ ప్రభు యేసు దయాళుడ వీవు - కృంగివచ్చుచున్నాను
నా పాపములు క్షమియించు ప్రభువా - గొప్ప రక్షణ కర్త వీవె
|| పాపి ||
English   Paapini Nenu Thaptithi
Chorus
Paapini Nenu Tappiti Bhuvilo Rakshinchedi Vaarevaru
O Prabhu Yesu Nireekshanato - Nee Dariki Jeritini
1)
Prabhuvaa Paapini Rakshinchutaku - Ee Bhuvi Karudenchitivi
Daurbhaagyudanu Vediti Saranan - Veremi Cheyalenu
|| Paapi ||
2)
Jeevamu Nivva Vachchitivi - Chachchi Yuntini Nenu
Bandhinpabaditini Marana Bandhamulo - Vidipinchedi Vaarevaru
|| Paapi ||
3)
Janmamutone Apavitradanu - Naa Svabhaavame Paapam
Kriyalalonu Maatalayandu - Neeku Virodhinaitini
|| Paapi ||
4)
Svanta Neetito Nindina Panulu - Mari Punyakaaryamulu
Aachaaramulo Chikkukonnaanu - Tappinchedi Vaarevaru
|| Paapi ||
5)
Bhariyinchitivi Paapapu Siksha - Praanamichchitivi Naakai
Raktamu Kaarchi Sarvamichchitivi - Nannu Rakshinchutakai
|| Paapi ||
6)
O Prabhu Yesu Dayaaluda Veevu - Krngivachchuchunnaanu
Naa Paapamulu Kshamiyinchu Prabhuvaa - Goppa Rakshana Karta Veeve
|| Paapi ||
Present