Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 734 Old No: 363

ప్రభు యేసుని వదనము

Prabhu Yesuni Vadanamu

Open in Word & Worship App
తెలుగు   ప్రభు యేసుని వదనము
పల్లవి
ప్రభుయేసుని వదనములో - నా దేవుడు కనుపించె
పాపాత్ముల బ్రోచుటకై - కృపలొలికిన కలువరిలో
పరలోకముకై చిరజీవముకై - ప్రార్థించెను నా హృదయం
1)
దిశలన్నియు తిరిగితిని - నా పాపపుదాహంతో
దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును
ధన పీడనతో మృగవాంఛలతో - దిగజారితి చావునకు
|| ప్రభు ||
2)
యేసు నీ రాజ్యముతో - భువికేతెంచెడిరోజు
ఈ పాపిని కరుణించి - జ్ఞాపకముతో బ్రోవుమని
ఇలవేడితిని విలపించుచును - ఈడేరెను నా వినతి
|| ప్రభు ||
3)
పరదైసున ఈ దినమే - నా ఆనందములోను
పాల్గొందువు నీ వనుచు - వాగ్దానము చేయగనే
పరలోకమె నా తుది వూపిరిగా - పయనించితి ప్రభుకడకు
|| ప్రభు ||
English   Prabhu Yesuni Vadanamu
Chorus
Prabhuyesuni Vadanamulo - Naa Devudu Kanupinche
Paapaatmula Brochutakai - Krupalolikina Kaluvarilo
Paralokamukai Chirajeevamukai - Praarthinchenu Naa Hrudayam
1)
Disalanniyu Tirigitini - Naa Paapapudaahanto
Daushtyamulo Masaluchunu - Daurjanyamu Cheyuchunu
Dhana Peedanato Mrgavaanchalato - Digajaariti Chaavunaku
|| Prabhu ||
2)
Yesu Nee Raajyamuto - Bhuviketenchediroju
Ee Paapini Karuninchi - Gnaapakamuto Brovumani
Ilaveditini Vilapinchuchunu - Eederenu Naa Vinati
|| Prabhu ||
3)
Paradaisuna Ee Diname - Naa Aanandamulonu
Paalgonduvu Nee Vanuchu - Vaagdaanamu Cheyagane
Paralokame Naa Tudi Voopirigaa - Payaninchiti Prabhukadaku
|| Prabhu ||
Present