Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 733 Old No: 362

మార్గము చూపుము

Maargamu Choopumu

Open in Word & Worship App
తెలుగు   మార్గము చూపుము
పల్లవి
మార్గము చూపుము యింటికి - నా తండ్రి యింటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి
1)
పాప మమతల చేత పారిపోయిన - నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమకోరుచు - పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు - పుట్టించె ధైర్యము
|| మా ||
2)
ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు - తండ్రిని
వీడితి - ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ - దేవా -
నిన్‌ చేరితి-దేహియని నీవైపు చేతులెత్తిన - నాకు దారిని జూపుము
|| మా ||
3)
దూరదేశములోన బాగుందు ననుకొనుచు - తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల - తరిమె దారిద్ర్యము
దాక్షిణ్యమూర్తినీ దయ నాపై కురిపించి - ధన్యుని జేయుము
|| మా ||
4)
అమ్ముకొంటిని నన్ను - అధముడొకనికి నాదు ఆకలి బాధచే
అన్యాయమైపోయె - పందులుసహ వెలివేయ అలవడెను ఆవేదన
అడుగంటో అవినీతి మేల్కొనియె మానవత ఆశ్రయము చూపుము
|| మా ||
5)
కొడుకునే కాదనుచు - గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి
కూలివానిగనైన నీ యింట పనిచేసి - కనికరము కోరుదు
కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు - క్షమియించి బ్రోవుమయా
|| మా ||
6)
నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచి - నాపై బడి ఏడ్చెను
నవజీవనము గూర్చి యింటికి తోడ్కొని వెళ్ళి - నన్ను దీవించెను
నా జీవిత కథయంత యేసు ప్రేమకు -
ధరలో సాక్ష్యమై - యుండును
|| మా ||
English   Maargamu Choopumu
Chorus
Maargamu Choopumu Yintiki - Naa Tandri Yintiki
Maadhurya Prema Prapanchamu Choopinchu Kantiki
1)
Paapa Mamatala Cheta Paaripoyina - Naaku Praaptinche Kshaamamu
Paschaattaapamu Nondi Tandri Kshamakoruchu - Panpumu Kshemamu
Prabhu Needu Siluva Mukhamu Chellani Naaku - Puttinche Dhairyamu
|| Maa ||
2)
Dhaname Sarvanbanuchu Sukhame Svarganbanuchu - Tandrini
Veediti - Dharani Bhogamulella Bratuku Dhvansamu Cheya - Devaa -
Nin Cheriti-Dehiyani Neevaipu Chetulettina - Naaku Daarini Joopumu
|| Maa ||
3)
Dooradesamulona Baagundu Nanukonuchu - Tappiti Maargamu
Taralipoyiri Nenu Nammina Hitulella - Tarime Daaridryamu
Daakshinyamoortinee Daya Naapai Kuripinchi - Dhanyuni Jeyumu
|| Maa ||
4)
Ammukontini Nannu - Adhamudokaniki Naadu Aakali Baadhache
Anyaayamaipoye - Pandulusaha Veliveya Alavadenu Aavedana
Aduganto Avineeti Melkoniye Maanavata Aasrayamu Choopumu
|| Maa ||
5)
Kodukune Kaadanuchu - Gruhame Cherasaalanuchu Kopinchi Velliti
Koolivaaniganaina Nee Yinta Panichesi - Kanikaramu Korudu
Kaadanaku Naa Tandri Dikkevvarunu Leru - Kshamiyinchi Brovumayaa
|| Maa ||
6)
Naa Tandri Nanujoochi Parugiduchu etenchi - Naapai Badi edchenu
Navajeevanamu Goorchi Yintiki Todkoni Velli - Nannu Deevinchenu
Naa Jeevita Kathayanta Yesu Premaku -
Dharalo Saakshyamai - Yundunu
|| Maa ||
Present