Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 732

నన్ను దిద్దుము

Nannu Diddumu

Open in Word & Worship App
తెలుగు   నన్ను దిద్దుము
పల్లవి
నన్ను దిద్దుము చిన్న ప్రాయము-సన్నుతుండగు నాయనా - నీవు -
కన్న తండ్రి వనుచు నేను-నిన్నుఁ జేరేతి నాయనా
1)
దూరమునకుఁబోయి నీ దరిఁ - జేర నైతిని నాయనా - నేను కారు
మూర్ఖపు పిల్లనై కా-రడవిఁ దిరిగితి నాయనా
|| నన్ను ||
2)
మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుఁడ నాయనా - నేను-
వంచితుండ నైతిని ప్రపంచమందున నాయనా
|| నన్ను ||
3)
చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా - నా - చాల
మొఱల నాలకించుము - జాలిగల నా నాయనా
|| నన్ను ||
4)
జ్ఞానమంతయుఁ బాడుచేసి - కాన నైతిని నాయనా నీవు - జ్ఞానము
గల తండ్రి వంచు - జ్ఞప్తివచ్చెను నాయనా
|| నన్ను ||
5)
కొద్ది నరుఁడను దిద్ది నను నీ - యొద్దఁ జేర్చుము నాయనా - నీ -
యొద్దఁ జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా
|| నన్ను ||
6)
ఎక్కడను నీవంటి మార్గము - నెఱుంగ నైతిని నాయనా - నీ - ఱెక్క
చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా
|| నన్ను ||
7)
శత్రువగు సాతాను నన్ను - మిత్రుఁజేయను నాయనా - యెన్నో
సూత్రములు గల్పించెను - నా నేత్రముల కో నాయనా
|| నన్ను ||
8)
వాసిగా నేఁ బాపలోకపు - వాసుఁడ నో నాయనా - నీ - దాసులలో
నొకనిగా ననుఁ - జేసి కావుము నాయనా
|| నన్ను ||
English   Nannu Diddumu
Chorus
Nannu Diddumu Chinna Praayamu-Sannutundagu Naayanaa - Neevu -
Kanna Tandri Vanuchu Nenu-Ninnun Jereti Naayanaa
1)
Dooramunakunboyi Nee Darin - Jera Naitini Naayanaa - Nenu Kaaru
Moorkhapu Pillanai Kaa-Radavin Dirigiti Naayanaa
|| Nannu ||
2)
Manchi Maargamu Ledu Naalo - Marana Paatrunda Naayanaa - Nenu-
Vanchitunda Naitini Prapanchamanduna Naayanaa
|| Nannu ||
3)
Chaala Maarulu Tappipotini - Melu Gaanaka Naayanaa - Naa - Chaala
Morala Naalakinchumu - Jaaligala Naa Naayanaa
|| Nannu ||
4)
Gnaanamantayun Baaduchesi - Kaana Naitini Naayanaa Neevu - Gnaanamu
Gala Tandri Vanchu - Gnaaptivachchenu Naayanaa
|| Nannu ||
5)
Koddi Narundanu Diddi Nanu Nee - Yoddan Jerchumu Naayanaa - Nee -
Yoddan Jerchi Buddhi Cheppumu - Moddu Naitini Naayanaa
|| Nannu ||
6)
Ekkadanu Neevanti Maargamu - Nerunga Naitini Naayanaa - Nee - rekka
Chaatuna Nannu Jerchi - Chakkaparachumu Naayanaa
|| Nannu ||
7)
Satruvagu Saataanu Nannu - Mitrunjeyanu Naayanaa - Yenno
Sootramulu Galpinchenu - Naa Netramula Ko Naayanaa
|| Nannu ||
8)
Vaasigaa Nen Baapalokapu - Vaasunda No Naayanaa - Nee - Daasulalo
Nokanigaa Nanun - Jesi Kaavumu Naayanaa
|| Nannu ||
Present