తెలుగు వందనమో వందనమేసయ్య
పల్లవివందనమో వందన మేసయ్యా - అందుకొనుము మా దేవా
మాదు - వందన మందుకొనుమయా
1)ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో
మరణము నొంది మరి లేచిన మా - మారని మహిమ రాజా
నీకిదే వందన మందుకొనుమయా
|| వంద ||
2)పాపిని జూచి ప్రేమనుజూపి - కరుణా కరముచే కల్వరి కడకు
నడిపించి కడు ప్రేమతో కడిగి - కన్నీటిని తుడిచిన నీ
ప్రేమకు సాటియే లేదిలలోన
|| వంద ||
3)ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము
దయతలచి దరిద్రుని పిలిచి దారిని జూపిన దాతా
దేవా హృదయార్పణ నర్పింతు
|| వంద ||
4)అనాథుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు
అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు
క్రీస్తుండా స్తుతిపాత్రుండ స్తుతింతు
|| వంద ||
5)జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ
నరులకై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా
రాజా నీకిదే నా స్తుతియాగం
|| వంద ||
6)పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో
ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు
క్షితినిన్ చేరి స్తుతింతు
|| వంద ||
7)స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడ - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా
రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా
నీకిదే వందనమందుకొనుమయా
|| వంద ||
English Vamdanamo Vamdanamesayya
ChorusVandanamo Vandana Mesayyaa - Andukonumu Maa Devaa
Maadu - Vandana Mandukonumayaa
1)Dharaketinchi Dhariyinchitivaa - Nararoopamunu Naralokamulo
Maranamu Nondi Mari Lechina Maa - Maarani Mahima Raajaa
Neekide Vandana Mandukonumayaa
|| Vanda ||
2)Paapini Joochi Premanujoopi - Karunaa Karamuche Kalvari Kadaku
Nadipinchi Kadu Premato Kadigi - Kanneetini Tudichina Nee
Premaku Saatiye Ledilalona
|| Vanda ||
3)Udayinchitivaa Nannudharinpa - Dhariyinchitivaa Daaruna Maranamu
Dayatalachi Daridruni Pilichi Daarini Joopina Daataa
Devaa Hrudayaarpana Narpintu
|| Vanda ||
4)Anaathundanu Naa Naathundaa - Andavai Naaku Bandaga Nundu
Andhuda Nenu Naa Dendamuna Nundi Nadipinchu
Kreestundaa Sthuthipaatrunda Sthuthintu
|| Vanda ||
5)Jagamunu Veedi Paramuna Karigi - Parisudhaatmanu Varamunu Viriviga
Narulakai Varadaa Dharalo Posina Durita Dooruda Raavaa
Raajaa Neekide Naa Sthuthiyaagan
|| Vanda ||
6)Paramunundi Parisuddhulato Paripoorna Prabhu Prabhaavamuto
Pravimaludaa Pratyakshanbaguduvu Akshaya Dehamu Takshanamichchu
Kshitinin Cheri Sthuthintu
|| Vanda ||
7)Sthuthistotraarhudaa Parama Poojyuda - Varnanaateetudaa Dhavalavarnudaa
Ratnavarnuda Riktudavaitivi Muktinichchina Daataa
Neekide Vandanamandukonumayaa
|| Vanda ||