Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 728 Old No: 561

రేపటి దినము నీది కాదు

Repati Dinamu Needi Kaadu

Open in Word & Worship App
తెలుగు   రేపటి దినము నీది కాదు
పల్లవి
రేపటి దినము నీది కాదు నేడైనను వశములో లేదు
ఈ క్షణమే నీ జీవితము మరు క్షణమున ఉందువో లేదో
1)
యౌవన కాలపు జీవితము అవనిలో అది ఔన్నత్యము
యౌవన జీవితమును బట్టి అవమానము నొందకుము
జీవాధిపతియైన ప్రభుకై జీవితమంతయు నర్పింతు !
|| రే ||
2)
గతియించెను లోకపు నటన గతియించును నీ జీవితమ
గతకాలపు నీ స్మృతులను మతిమరపు చేసుకొనుము
హితుడైన క్రీస్తుని చేరగను స్థితిలోనే పరుగడి రమ్ము!
|| రే ||
3)
సందేహించకు యౌవనుడా సంతోషముతో జీవించు
సంచరించు నీ కోరికతో సంతృప్తి హృదయముతో
సంభాషించును నీతో యేసు సంగతులన్నియు తీర్పులో!
|| రే ||
English   Repati Dinamu Needi Kaadu
Chorus
Repati Dinamu Needi Kaadu Nedainanu Vasamulo Ledu
Ee Kshaname Nee Jeevitamu Maru Kshanamuna Unduvo Ledo
1)
Yauvana Kaalapu Jeevitamu Avanilo Adi Aunnatyamu
Yauvana Jeevitamunu Batti Avamaanamu Nondakumu
Jeevaadhipatiyaina Prabhukai Jeevitamantayu Narpintu !
|| Re ||
2)
Gatiyinchenu Lokapu Natana Gatiyinchunu Nee Jeevitama
Gatakaalapu Nee Smrtulanu Matimarapu Chesukonumu
Hitudaina Kreestuni Cheraganu Sthitilone Parugadi Rammu!
|| Re ||
3)
Sandehinchaku Yauvanudaa Santoshamuto Jeevinchu
Sancharinchu Nee Korikato Santrupti Hrudayamuto
Sanbhaashinchunu Neeto Yesu Sangatulanniyu Teerpulo!
|| Re ||
Present