తెలుగు యౌవన జనమా
పల్లవియౌవన జనమా నవ - యౌవన జనమా
యేసు పిలుపు వినుమా - నీ దోషము బాపుకొనుమా
1)యౌవన మందానందము - నీవెంతగానో పొందుము
అయితే నీదుక్రియలఁబట్టి - తీర్పు గలదని నమ్ముము
|| యౌవన ||
2)మాయలోకం మాయరా - నిను ఖాయం మోసం చేయురా
మాయమగు లోకమును నమ్మి - మోసపోకుము సోదరా
|| యౌవన ||
3)నీ జీవం ఏపాటిది - అది నీటిబుడగలాటిది
ఇంతలోన కనబడి - అంతలో మాయమౌనది
|| యౌవన ||
4)పాపమందే యుండి - నీవు మరణంబు నొందినచో
పాపపు శిక్ష నరకము - మగ్గిపోదువు అగ్నిలో
|| యౌవన ||
5)యౌవనేచ్ఛలను వీడి - నీ దుష్ట క్రియలను మాని
యౌవనమందే బలిగయైన - యేసు ప్రభుని చేరుము
|| యౌవన ||
6)పాపులమైన మనకై తన - ప్రాణము పెట్టి లేచెను
పాపములొప్పుకో ప్రభునితో - పరమున నేడే చేర్చును
|| యౌవన ||
English Yauvana Janamaa
ChorusYauvana Janamaa Nava - Yauvana Janamaa
Yesu Pilupu Vinumaa - Nee Doshamu Baapukonumaa
1)Yauvana Mandaanandamu - Neeventagaano Pondumu
Ayite Needukriyalanbatti - Teerpu Galadani Nammumu
|| Yauvana ||
2)Maayalokan Maayaraa - Ninu Khaayan Mosan Cheyuraa
Maayamagu Lokamunu Nammi - Mosapokumu Sodaraa
|| Yauvana ||
3)Nee Jeevan epaatidi - Adi Neetibudagalaatidi
Intalona Kanabadi - Antalo Maayamaunadi
|| Yauvana ||
4)Paapamande Yundi - Neevu Marananbu Nondinacho
Paapapu Siksha Narakamu - Maggipoduvu Agnilo
|| Yauvana ||
5)Yauvanechchalanu Veedi - Nee Dushta Kriyalanu Maani
Yauvanamande Baligayaina - Yesu Prabhuni Cherumu
|| Yauvana ||
6)Paapulamaina Manakai Tana - Praanamu Petti Lechenu
Paapamuloppuko Prabhunito - Paramuna Nede Cherchunu
|| Yauvana ||