Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 722

నన్నుకున్నావా

Nannukunnaaavaa

Open in Word & Worship App
తెలుగు   నన్నుకున్నావా
పల్లవి
నమ్ముకున్నావా - నీవు నమ్ముకున్నావా
నిజదేవుడైన - యేసు ప్రభునే నమ్ముకున్నావా
నిత్యజీవ - మార్గం యేసులో చేరియున్నావా
నిత్యనరక శిక్ష నుండి తప్పుకున్నావా
రక్షణ నొంది యున్నవా
నిత్యజీవ - మార్గం యేసులో చేరియున్నావా
లేక నిత్య నరక శిక్ష క్రిందే బ్రతుకు చున్నావా
1)
సర్వశక్తి సంపన్నుడే - కృపాసత్య సంపూర్ణుడే - పాపులను
ప్రేమించి - పరము వీడిన దైవసుతుడే
లోక పాపపు శిక్ష మోయ - దీనుడై దిగి వచ్చినాడే
చెప్పినట్టే మరణమొంది - ధీరుడై మరి లేచినాడే - తాను
మరి నమ్ముకున్నావా?
|| నమ్ము ||
2)
శత్రువులను ప్రేమించిన - ప్రేమామయుడాయనే
బలహీనుల కరుణించిన - కరుణామయుడాయనే
భక్తిహీనుల కొరకు - ప్రాణమిచ్చెనాయనే
పాపములను పరిహరింప ప్రాయశ్చిత్తమాయెనే - మన
మరి నమ్ముకున్నావా?
|| నమ్ము ||
3)
పాపదాస్యం నుండి నిన్ను - విడిపించునాయనే
చెప్పశక్యంగాని మహిమ - సంతోషమీయునే
నీతిమంతుని చేసి నిన్ను చక్కగా నడిపించునే
దేవుడేసే నిశ్చయముగా - పరలోకం చేర్చునే - నిజ
మరి నమ్ముకున్నావా?
|| నమ్ము ||
4)
గొప్ప రక్షణ సిద్ధపరచి - సువార్త నీకై పంపినాడే
మారుమనస్సు పొంది నీవు - నమ్ముకొంటే చాలు నేడే
పాపమెల్లను పరిహరించి - ఆత్మరక్షణనిచ్చు నేడే
ఇంత గొప్ప రక్షకుండు - లోకమందిక లేనే లేడే - ఆహా
మరి నమ్ముకున్నావా?
|| నమ్ము ||
English   Nannukunnaaavaa
Chorus
Nammukunnaavaa - Neevu Nammukunnaavaa
Nijadevudaina - Yesu Prabhune Nammukunnaavaa
Nityajeeva - Maargan Yesulo Cheriyunnaavaa
Nityanaraka Siksha Nundi Tappukunnaavaa
Rakshana Nondi Yunnavaa
Nityajeeva - Maargan Yesulo Cheriyunnaavaa
Leka Nitya Naraka Siksha Krinde Bratuku Chunnaavaa
1)
Sarvasakti Sanpannude - Krupaasatya Sanpoornude - Paapulanu
Preminchi - Paramu Veedina Daivasutude
Loka Paapapu Siksha Moya - Deenudai Digi Vachchinaade
Cheppinatte Maranamondi - Dheerudai Mari Lechinaade - Taanu
Mari Nammukunnaavaa?
|| Nammu ||
2)
Satruvulanu Preminchina - Premaamayudaayane
Balaheenula Karuninchina - Karunaamayudaayane
Bhaktiheenula Koraku - Praanamichchenaayane
Paapamulanu Pariharinpa Praayaschittamaayene - Mana
Mari Nammukunnaavaa?
|| Nammu ||
3)
Paapadaasyan Nundi Ninnu - Vidipinchunaayane
Cheppasakyangaani Mahima - Santoshameeyune
Neetimantuni Chesi Ninnu Chakkagaa Nadipinchune
Devudese Nischayamugaa - Paralokan Cherchune - Nija
Mari Nammukunnaavaa?
|| Nammu ||
4)
Goppa Rakshana Sidhaparachi - Suvaarta Neekai Panpinaade
Maarumanassu Pondi Neevu - Nammukonte Chaalu Nede
Paapamellanu Pariharinchi - Aatmarakshananichchu Nede
Inta Goppa Rakshakundu - Lokamandika Lene Lede - Aahaa
Mari Nammukunnaavaa?
|| Nammu ||
Present