Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 718 Old No: 498

ఈ నీ దినమందైన

Ee Nee Dinamandaina

Open in Word & Worship App
తెలుగు   ఈ నీ దినమందైన
పల్లవి
ఈ నీదిన మందైనా సమాధాన సంబంధమైన
సంగతులను తెలుసు కొనిన - నీకెంతో మేలు సుమా
1)
చెడిపోయిన హృదయముతో - చెరిగిన మార్గంబుతో
పడిపోయిన స్థితియందు - నీవున్నావు ఎరుగవా
ఇదే నీకు అనుకూల సమయం - కడసారి తరుణమిదేమో
కాదనకు నీ హృదయం - తెరుపుము యేసు కొరకు
|| ఈ నీది ||
2)
లోకమును ప్రేమించి - యేసుని ద్వేషింతువా
లోకమును దాని ఆశలు -గతియించును ఎరుగవా
ఇదే నీకు అనుకూల సమయం - ఇదే నీ రక్షణ దినము
కాదనకు ఈ క్షణమే - ప్రభు యేసుని స్వీకరించు
|| ఈ నీది ||
3)
నిను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు
నీ కొరకు ఆ సిలువలో బలియాయెను, చూడుము
ప్రభు యేసు కార్చిన రక్తము - ప్రతి పాపమును కడుగుగా
కాదనకు - కనులెత్తి - చూడుము - సిలువ వైపు
|| ఈ నీది ||
4)
క్షణ భంగురం - నీ జీవితం - గతియించును త్వరితమే
రేపేమి సంభవించునో - నీవెరుగవు ఇది నిజం
ఇదే నీకు అనుకూల సమయము - కడసారి తరుణ
మిదేమో - రావేల జాగేల - ప్రభు యేసుని సన్నిధికి
|| ఈ నీది ||
English   Ee Nee Dinamandaina
Chorus
Ee Needina Mandainaa Samaadhaana Sanbandhamaina
Sangatulanu Telusu Konina - Neekento Melu Sumaa
1)
Chedipoyina Hrudayamuto - Cherigina Maarganbuto
Padipoyina Sthitiyandu - Neevunnaavu Erugavaa
Ide Neeku Anukoola Samayan - Kadasaari Tarunamidemo
Kaadanaku Nee Hrudayan - Terupumu Yesu Koraku
|| Ee Needi ||
2)
Lokamunu Preminchi - Yesuni Dveshintuvaa
Lokamunu Daani Aasalu -Gatiyinchunu Erugavaa
Ide Neeku Anukoola Samayan - Ide Nee Rakshana Dinamu
Kaadanaku Ee Kshaname - Prabhu Yesuni Sveekarinchu
|| Ee Needi ||
3)
Ninu Yesu Entagaano Preminchuchunnaadu
Nee Koraku Aa Siluvalo Baliyaayenu, Choodumu
Prabhu Yesu Kaarchina Raktamu - Prati Paapamunu Kadugugaa
Kaadanaku - Kanuletti - Choodumu - Siluva Vaipu
|| Ee Needi ||
4)
Kshana Bhanguran - Nee Jeevitan - Gatiyinchunu Tvaritame
Repemi Sanbhavinchuno - Neeverugavu Idi Nijam
Ide Neeku Anukoola Samayamu - Kadasaari Taruna
Midemo - Raavela Jaagela - Prabhu Yesuni Sannidhiki
|| Ee Needi ||
Present