Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 717 Old No: 365

నరకము స్వర్గలవా

Narakamu Svargalavaa

Open in Word & Worship App
తెలుగు   నరకము స్వర్గలవా
పల్లవి
నరకము నోర్వగలవా - నరకమందుండగలవా
ప్రియ స్నేహితుడా - నిత్య నరకాగ్ని బాధలను గనుమా
1)
అపవాదికిని వాని దూతలకున్‌ - అదియు నిర్మింపబడె నీకు కాదు
పాపఫలితము వలన మరణము వచ్చెను మనకు - ప్రియ
స్నేహితుడా - ప్రాప్తమాయెను రెండవ మరణము గూడ
|| నర ||
2)
యుగయుగములు అగ్నిగుండములో - పొగలు లేచును
గుబలు గుబలుగను - పగలు రాత్రియనక - పాపులు
కాలుచుందురు ప్రియ స్నేహితుడా - ప్రభుని నమ్మనిచో
నీగతియు నంతే
|| నర ||
3)
పురుగు చావదు అగ్ని ఆరదచట - పండ్లు కొరుకుచు వేదన
నొందెదరు - బూడిదకాదు దేహం బాధకు అంతమే లేదు
ప్రియ స్నేహితుడా - బాధపడలేక బహుగా ఏడ్చెదవు
|| నర ||
4)
ప్రకటన గ్రంథములో ప్రకటింపబడిన - క్రూరమృగముండు
నరక గుండములో - అబద్ధప్రవక్త ఘట సర్పము దూతలు
ప్రియ స్నేహితుడా - అకటా వారివలె నీవందుండెదవా
|| నర ||
English   Narakamu Svargalavaa
Chorus
Narakamu Norvagalavaa - Narakamandundagalavaa
Priya Snehitudaa - Nitya Narakaagni Baadhalanu Ganumaa
1)
Apavaadikini Vaani Dootalakun - Adiyu Nirminpabade Neeku Kaadu
Paapaphalitamu Valana Maranamu Vachchenu Manaku - Priya
Snehitudaa - Praaptamaayenu Rendava Maranamu Gooda
|| Nara ||
2)
Yugayugamulu Agnigundamulo - Pogalu Lechunu
Gubalu Gubaluganu - Pagalu Raatriyanaka - Paapulu
Kaaluchunduru Priya Snehitudaa - Prabhuni Nammanicho
Neegatiyu Nante
|| Nara ||
3)
Purugu Chaavadu Agni Aaradachata - Pandlu Korukuchu Vedana
Nondedaru - Boodidakaadu Dehan Baadhaku Antame Ledu
Priya Snehitudaa - Baadhapadaleka Bahugaa edchedavu
|| Nara ||
4)
Prakatana Granthamulo Prakatinpabadina - Krooramrgamundu
Naraka Gundamulo - Abadhapravakta Ghata Sarpamu Dootalu
Priya Snehitudaa - Akataa Vaarivale Neevandundedavaa
|| Nara ||
Present