Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 716 Old No: 364

బుగ్వేదములో మరుగు

Bugvedhamulo Marugu

Open in Word & Worship App
తెలుగు   బుగ్వేదములో మరుగు
పల్లవి
ఋగ్వేదములో మరుగు కాబడిన - యజ్ఞ పశువును వింటిరా
యోగ్యతలెవ్వియో యెవనికి సూచనో - నిర్భాగ్యులనెటు
బ్రోచెనో ఆ యజ్ఞము మనకెటు భాగ్యమో
1)
యే అపవిత్రత యే మచ్చలేని - మెచ్చిన మేకయన్నట్లు
యే పాపములేని దైవనరుడు క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
2)
ఆ మేకతలకు బలుసుకంపను - అదిమిచుట్టవలె నన్నట్లు
అలనాడు ముండ్ల మకుటము బెట్టిరి - క్రీస్తునందు నెరవేరెను
|| ఋ ||
3)
యూపస్థంభముకు మేకపిల్లను - మోపికట్టవలెనన్నట్లు
కృపమాలి కొరతమ్రానికి గొట్టిరి - క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
4)
మేక కాళ్ళలో రక్తము కారగ - మేకుగొట్టవలెనన్నట్లు
మేకులు గొట్టిరి కాళ్ళను చేతుల - క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
5)
పైన కప్పిన మేక కచ్చడము - పంచుకొనవలెనన్నట్లు
పంచుకొనిరి ప్రభు క్రీస్తు వస్త్రములు - క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
6)
మేక యెముకలలో నొక్కటైనను - విరువబడకూడదన్నట్లు
ఒక యెముకయైనను విరువగలేదు - క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
7)
సొమ్మసిల్లిన మేక పిల్లకు - సోమరస మిత్తురన్నట్లు
చేదున కలిపిన చిరక నిచ్చిరి - క్రీస్తునందు నెరవేరనులే
|| ఋ ||
8)
వధానంతరము మేకకు - ప్రాణ ప్రతిష్ట జేయవలెనన్నట్లు
మృత్యుంజయుడై తిరిగిలేచెను - క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
9)
పవిత్రమైన యీ మేక మాంసమును - భుజియింపవలెనన్నట్లు
ప్రభురాత్రి భోజన సంస్కారము - క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
10)
సిలువను గూర్చిన విలువగువార్త - నశించు వారికి వెఱ్ఱిగాని
పిలవబడు మనకు దేవుని శక్తి - క్రీస్తునందు నెరవేరెనులే
|| ఋ ||
11)
లోకము తనదు జ్ఞానముచేత - లోకరక్షకుని నెరుగకపోగా
ప్రకటనలను వెఱ్ఱితనముచేత - రక్షణ సంకల్పమాయెను
|| ఋ ||
English   Bugvedhamulo Marugu
Chorus
Rgvedamulo Marugu Kaabadina - Yagnaa Pasuvunu Vintiraa
Yogyatalevviyo Yevaniki Soochano - Nirbhaagyulanetu
Brocheno Aa Yagnaamu Manaketu Bhaagyamo
1)
Ye Apavitrata Ye Machchaleni - Mechchina Mekayannatlu
Ye Paapamuleni Daivanarudu Kreestunandu Neraverenule
|| R ||
2)
Aa Mekatalaku Balusukanpanu - Adimichuttavale Nannatlu
Alanaadu Mundla Makutamu Bettiri - Kreestunandu Neraverenu
|| R ||
3)
Yoopasthanbhamuku Mekapillanu - Mopikattavalenannatlu
Krupamaali Koratamraaniki Gottiri - Kreestunandu Neraverenule
|| R ||
4)
Meka Kaallalo Raktamu Kaaraga - Mekugottavalenannatlu
Mekulu Gottiri Kaallanu Chetula - Kreestunandu Neraverenule
|| R ||
5)
Paina Kappina Meka Kachchadamu - Panchukonavalenannatlu
Panchukoniri Prabhu Kreestu Vastramulu - Kreestunandu Neraverenule
|| R ||
6)
Meka Yemukalalo Nokkatainanu - Viruvabadakoodadannatlu
Oka Yemukayainanu Viruvagaledu - Kreestunandu Neraverenule
|| R ||
7)
Sommasillina Meka Pillaku - Somarasa Mitturannatlu
Cheduna Kalipina Chiraka Nichchiri - Kreestunandu Neraveranule
|| R ||
8)
Vadhaanantaramu Mekaku - Praana Pratishta Jeyavalenannatlu
Mrtyunjayudai Tirigilechenu - Kreestunandu Neraverenule
|| R ||
9)
Pavitramaina Yee Meka Maansamunu - Bhujiyinpavalenannatlu
Prabhuraatri Bhojana Sanskaaramu - Kreestunandu Neraverenule
|| R ||
10)
Siluvanu Goorchina Viluvaguvaarta - Nasinchu Vaariki Verrigaani
Pilavabadu Manaku Devuni Sakti - Kreestunandu Neraverenule
|| R ||
11)
Lokamu Tanadu Gnaanamucheta - Lokarakshakuni Nerugakapogaa
Prakatanalanu Verritanamucheta - Rakshana Sankalpamaayenu
|| R ||
Present