తెలుగు ఏ సాటిలేని యేసుని ప్రేమన్
పల్లవిఏ సాటిలేని యేసుని ప్రేమన్ - ఎపుడైన రుచియించినావా
ఇపుడైన ఆశించిరావా?
1)వేదంబులందు వ్రాయబడినట్టు - ఈ ధరను రక్షింప నవతరించి
బలియాగమైన ప్రభుయేసుగాక - మరియెవ్వరైనను గలరా?
మనసార యోచించి రావా?
|| ఏ సాటి ||
2)విజ్ఞాన తత్వ మనస్ తత్వ శాస్త్రం - తత్వజ్ఞాన వేదాల నిలయం
ప్రవచన సారం ప్రభుయేసే జీవం - సార్వత్రికాని కాధారం
మహిమ ప్రభావాల సారం
|| ఏ సాటి ||
3)నీ దేవుండెవ్వరు? నీ పూజెవ్వరికి? - నశింయించె వెండిబంగారాలకా
నిజదైవ మెవరో నీ రక్షకుడెవరో - నీ వెన్నడైన తలచావా?
నీ కున్న లోటెరిగినావా
|| ఏ సాటి ||
4)నిర్దేవుండవా? నీ దేవుండెవరు? నిన్ను నీవే పూజించుచున్నావా
కన్నతండ్రిని కనలేక నీవు - ఎన్నాళ్ళు యీ తడవులాట?
కొన్నాళ్లేగా లోక ఆట
|| ఏ సాటి ||
5)కలువరి గిరిపై విలువైన ప్రాణం - అర్పించి మరణించింది
నీ కొరకే నిన్నెంతగానో ప్రేమించి నట్టి - నీ దేవుని ప్రేమన్
గ్రోలన్ మోదంబున రావదేల?
|| ఏ సాటి ||
6)శుభకరంబైన విభవంబొసంగు - ప్రభుని మాటిదే అభయంబిదే
ఆలస్యమేల ? అనుమానమేల? - అన్యుండవై యుండనేల?
ఆయనయందుండవేల ?
|| ఏ సాటి ||
English Ee Saatileni Yesuni Preman
Choruse Saatileni Yesuni Preman - Epudaina Ruchiyinchinaavaa
Ipudaina Aasinchiraavaa?
1)Vedanbulandu Vraayabadinattu - Ee Dharanu Rakshinpa Navatarinchi
Baliyaagamaina Prabhuyesugaaka - Mariyevvarainanu Galaraa?
Manasaara Yochinchi Raavaa?
|| e Saati ||
2)Vignaana Tatva Manas Tatva Saastran - Tatvagnaana Vedaala Nilayam
Pravachana Saaran Prabhuyese Jeevan - Saarvatrikaani Kaadhaaram
Mahima Prabhaavaala Saaran
|| e Saati ||
3)Nee Devundevvaru? Nee Poojevvariki? - Nasimyinche Vendibangaaraalakaa
Nijadaiva Mevaro Nee Rakshakudevaro - Nee Vennadaina Talachaavaa?
Nee Kunna Loteriginaavaa
|| e Saati ||
4)Nirdevundavaa? Nee Devundevaru? Ninnu Neeve Poojinchuchunnaavaa
Kannatandrini Kanaleka Neevu - Ennaallu Yee Tadavulaata?
Konnaallegaa Loka Aata
|| e Saati ||
5)Kaluvari Giripai Viluvaina Praanan - Arpinchi Maraninchindi
Nee Korake Ninnentagaano Preminchi Natti - Nee Devuni Preman
Grolan Modanbuna Raavadela?
|| e Saati ||
6)Subhakaranbaina Vibhavanbosangu - Prabhuni Maatide Abhayanbide
Aalasyamela ? Anumaanamela? - Anyundavai Yundanela?
Aayanayandundavela ?
|| e Saati ||