Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 71 Old No: 42

స్తుతింతున్ ప్రభుయేసు

Sthuthimtun Prabhuyesu

Open in Word & Worship App
తెలుగు   స్తుతింతున్ ప్రభుయేసు
పల్లవి
స్తుతింతున్‌ ప్రభు యేసుని - ఆరాధనతో
యింతవరకు కాచే దేవుడే
1)
కరుణతోడనే మముగాచె - కొరత లేని మేళ్ళనిచ్చె
చేర్చె ప్రజలనెందరినో - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతి ||
2)
సువార్త సైన్యమునిచ్చె - భువిపై శత్రుని పనినాపె
వినినవారిని ప్రత్యేకించె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతి ||
3)
పరిశుద్ధ సంఘముకూర్చె - నేర్పె సత్యమర్మములు
సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతి ||
4)
సేవకుల నిచ్చెను బహుగ - కావలియుంచెను ప్రభువే
సహపని వారినొసగె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతి ||
5)
పరమ దర్శనమునిచ్చి - సరిగలోబరచె మనల
కరమునిచ్చి నడిపించె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతి ||
6)
సంఘ మర్మమును దెల్పి - శీఘ్రముగ పంపెను వార్త
మార్చె పాపుల నెందరినో - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతి ||
English   Sthuthimtun Prabhuyesu
Chorus
Sthuthintun Prabhu Yesuni - Aaraadhanato
Yintavaraku Kaache Devude
1)
Karunatodane Mamugaache - Korata Leni Mellanichche
Cherche Prajalanendarino - Cheripaadi Sthuthinchedamu
|| Sthuthi ||
2)
Suvaarta Sainyamunichche - Bhuvipai Satruni Paninaape
Vininavaarini Pratyekinche - Cheripaadi Sthuthinchedamu
|| Sthuthi ||
3)
Parisudha Sanghamukoorche - Nerpe Satyamarmamulu
Sariga Saakshyamu Sthaapinche - Cheripaadi Sthuthinchedamu
|| Sthuthi ||
4)
Sevakula Nichchenu Bahuga - Kaavaliyunchenu Prabhuve
Sahapani Vaarinosage - Cheripaadi Sthuthinchedamu
|| Sthuthi ||
5)
Parama Darsanamunichchi - Sarigalobarache Manala
Karamunichchi Nadipinche - Cheripaadi Sthuthinchedamu
|| Sthuthi ||
6)
Sangha Marmamunu Delpi - Seeghramuga Panpenu Vaarta
Maarche Paapula Nendarino - Cheripaadi Sthuthinchedamu
|| Sthuthi ||
Present