తెలుగు పాపము చేయకుమా
పల్లవిపాపము చేయకుమా - దైవ కోపము రేపకుమా - పాపపు భారము భరింపలేవు
1)ఒకటి ఒకటిగా చేసెదవు - వందలు వేలుగ కూర్చెదవు
ఒక్కసారి నీపైన బడగనే - దిక్కు తెలియక పరుగులిడుదువు
|| పా ||
2)దేహము దేవుని ఆలయమనెడి - దేవుని వాక్యము మరచెదవా
దైవమందిరమును నీవిల - పాడుచేయక పరుగులిడుచురా
|| పా ||
3)లోకమునే ప్రేమించెదవా - శోకముతో నశియించెదవా
మోసకారి యా సాతానుడు యిల -
త్రాచుపామువలె తిరుగుచుండగ
|| పా ||
4)పాపములను ఇల చేసెదవా - మోసములకే మనసిచ్చెదవా
యేసుప్రభువు నిను పిలుచుచుండగ - ఎరుగనట్లుగ -
తిరుగుచుందువా
|| పా ||
5)ఎం.ఏ.లు, బి.ఏ.లు చదివిన - వెండి బంగారంబులుండిన
వెదురు బద్ధలమీద గట్టుట - ఎరుగవేలనో వెర్రిమనుజుడా
|| పా ||
6)హద్దు మీరు నీ పెద్ద పాపములు - ఖుద్దునజూచు రక్షకుడే తన
యొద్దకు రమ్మని పిలుచుచుండగ - అద్దరికేగి శరణు వేడుమా
|| పా ||
English Paapamu Cheyakumaa
ChorusPaapamu Cheyakumaa - Daiva Kopamu Repakumaa - Paapapu Bhaaramu
Bharinpalevu
1)Okati Okatigaa Chesedavu - Vandalu Veluga Koorchedavu
Okkasaari Neepaina Badagane - Dikku Teliyaka Paruguliduduvu
|| Paa ||
2)Dehamu Devuni Aalayamanedi - Devuni Vaakyamu Marachedavaa
Daivamandiramunu Neevila - Paaducheyaka Paruguliduchuraa
|| Paa ||
3)Lokamune Preminchedavaa - Sokamuto Nasiyinchedavaa
Mosakaari Yaa Saataanudu Yila -
Traachupaamuvale Tiruguchundaga
|| Paa ||
4)Paapamulanu Ila Chesedavaa - Mosamulake Manasichchedavaa
Yesuprabhuvu Ninu Piluchuchundaga - Eruganatluga -
Tiruguchunduvaa
|| Paa ||
5)[En.e.Lu](http://En.e.Lu),Bi.e.LuChadivina - Vendi Bangaaranbulundina
Veduru Badhalameeda Gattuta - Erugavelano Verrimanujudaa
|| Paa ||
6)Haddu Meeru Nee Pedda Paapamulu - Khuddunajoochu Rakshakude Tana
Yoddaku Rammani Piluchuchundaga - Addarikegi Saranu Vedumaa
|| Paa ||