Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 705 Old No: 349

యేసుని చెంతకు ఆశతో

Yesuni Chentaku Aashatho

Open in Word & Worship App
తెలుగు   యేసుని చెంతకు ఆశతో
పల్లవి
యేసుని చెంతకు ఆశతో రమ్మిల - దోషముల్‌ బాపునయా
ఇదియే మిక్కిలి అనుకూల సమయము - యిదే రక్షణ దినము
ఇపుడే యేసుని ఎదలో నమ్మిన - యిదె రక్షణ దినము
1)
జపములు తపములు ఉపవాసములు - పాపముల్‌ బాపవయా
దానధర్మములు తీర్థయాత్రలు - పాపముల్‌ బాపవయా
యేసుని రక్తమే పాపము శాపము - యిపుడే బాపునయా
|| యేసుని ||
2)
పాపులకొఱకై మన ప్రభుయేసు - ప్రాణము బెట్టెనయా
మృతుడై లేచెను పరమున కేగెను - ధరకేతెంచునయా
స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా
|| యేసుని ||
3)
యేసుని నామము పావన నామము - దోషముల్‌ బాపునయా
ఈ శుభవార్త ఈ జగమంతా - యిపుడే చాటెదము
తరుణము దాటిన మరియికరాదు - నరకము తప్పదయా
|| యేసుని ||
English   Yesuni Chentaku Aashatho
Chorus
Yesuni Chentaku Aasato Rammila - Doshamul Baapunayaa
Idiye Mikkili Anukoola Samayamu - Yide Rakshana Dinamu
Ipude Yesuni Edalo Nammina - Yide Rakshana Dinamu
1)
Japamulu Tapamulu Upavaasamulu - Paapamul Baapavayaa
Daanadharmamulu Teerthayaatralu - Paapamul Baapavayaa
Yesuni Raktame Paapamu Saapamu - Yipude Baapunayaa
|| Yesuni ||
2)
Paapulakorakai Mana Prabhuyesu - Praanamu Bettenayaa
Mrtudai Lechenu Paramuna Kegenu - Dharaketenchunayaa
Sthiramani Nammina Vaariki Paramaanandamu Dorukunayaa
|| Yesuni ||
3)
Yesuni Naamamu Paavana Naamamu - Doshamul Baapunayaa
Ee Subhavaarta Ee Jagamantaa - Yipude Chaatedamu
Tarunamu Daatina Mariyikaraadu - Narakamu Tappadayaa
|| Yesuni ||
Present