Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 700 Old No: 343

యేసుని స్వీకరించు

Yesuni Sveekarinchu

Open in Word & Worship App
తెలుగు   యేసుని స్వీకరించు
పల్లవి
యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు
నీ హృదయపు ద్వారము తెరువుము - త్వరితము తానే - ప్రవేశించును
1)
కనికరమందైశ్వర్యుండు - నిన్ను వాత్సల్యముతో విమోచించును
భయంకరమైన పాపము నుండి - విడిపింప నిన్ను వెదక వచ్చెన్‌
|| యేసు ||
2)
మన్నించు సర్వపాపములన్‌ - తానే మాన్పును సర్వరోగములన్‌
కృప కనికరముల మకుటము నీకు - ధరియింపజేసి ఘనపరచున్‌
|| యేసు ||
3)
పాపపుభారము భరియించెన్‌ - నీ రోగములన్నియు తొలగించెన్‌
సహించెను కొరడా దెబ్బల బాధను -
జయించెను అన్ని - శోధనలన్‌
|| యేసు ||
4)
కలువరి సిలువలో వ్రేలాడి - తన రక్తము చిందించె ధారలుగా
కాళ్ళ చేతులలో చీలలు తలను - ముండ్ల కిరీటము ధరియించె
|| యేసు ||
5)
జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి జయించెను ప్రతివిధ శోధనలు
నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడై నిను రక్షింప
|| యేసు ||
English   Yesuni Sveekarinchu
Chorus
Yesuni Sveekarinchu - Kreestesuni Sveekarinchu
Nee Hrudayapu Dvaaramu Teruvumu - Tvaritamu Taane - Pravesinchunu
1)
Kanikaramandaisvaryundu - Ninnu Vaatsalyamuto Vimochinchunu
Bhayankaramaina Paapamu Nundi - Vidipinpa Ninnu Vedaka Vachchen
|| Yesu ||
2)
Manninchu Sarvapaapamulan - Taane Maanpunu Sarvarogamulan
Krupa Kanikaramula Makutamu Neeku - Dhariyinpajesi Ghanaparachun
|| Yesu ||
3)
Paapapubhaaramu Bhariyinchen - Nee Rogamulanniyu Tolaginchen
Sahinchenu Koradaa Debbala Baadhanu -
Jayinchenu Anni - Sodhanalan
|| Yesu ||
4)
Kaluvari Siluvalo Vrelaadi - Tana Raktamu Chindinche Dhaaralugaa
Kaalla Chetulalo Cheelalu Talanu - Mundla Kireetamu Dhariyinche
|| Yesu ||
5)
Jeevamichchutaku Praanamide - Mari Jayinchenu Pratividha Sodhanalu
Nee Korakai Maraninchi Lechenu - Saktimantudai Ninu Rakshinpa
|| Yesu ||
Present