తెలుగు యేసుప్రభువే నీకు రక్షణ
పల్లవియేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును - ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు
1)మృతియే పాపపు జీతము - ప్రభుని వరము జీవము
క్రీస్తునంగీకరించిన - నిత్యజీవ మిచ్చును
ప్రాణమున్ ఆ సిలువపైని బలిగానిడి నిన్‌కొనెగదా
మరతువా యేసుని ప్రేమను - మరువకు
|| యేసు ||
2)కంటికి కనబడనివెన్నో - చెవిక వినబడనివెన్నో
గ్రహింప శక్యము కానివి - నీకై సిద్ధపరచెను
ప్రాణమున్ ఆ సిలువపైని బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ బెట్టకు యేసుని - మాటను
|| యేసు ||
3)మరణబలము గలవానిన్ - నాశనంబు జేసెను
మరణభయములోనున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో
|| యేసు ||
4)సిలువ రక్తము చేతను - నిర్దేవులైనవారిని
మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచె దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపైని - బలగానిడి నిన్ కొనెగదా
సమాధాన పడుమిక - దేవునితో - యీ క్షణమే
|| యేసు ||
5)దైవ స్వభావంబులో - పరిశుద్ధాత్మునియందు
పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగానిడి నిన్ కొనెగదా
పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ మొందుము
|| యేసు ||
6)దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగానిడి నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును పొందను
|| యేసు ||
7)పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్
ధరించుకొను సమూహము - ఖర్జూరమట్టలు చేబూని
దేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
నీవు నీ రక్షణకై పాడుము - హల్లెలూయ
|| యేసు ||
English Yesuprabhuuve Neeku Rakshana
ChorusYesu Prabhuve Neeku Rakshana Nichchunu - Inta Goppa - Rakshana
Nirlakshya Pettaku
1)Mrtiye Paapapu Jeetamu - Prabhuni Varamu Jeevamu
Kreestunangeekarinchina - Nityajeeva Michchunu
Praanamun Aa Siluvapaini Baligaanidi NinKonegadaa
Maratuvaa Yesuni Premanu - Maruvaku
|| Yesu ||
2)Kantiki Kanabadanivenno - Chevika Vinabadanivenno
Grahinpa Sakyamu Kaanivi - Neekai Sidhaparachenu
Praanamun Aa Siluvapaini Baligaa Nidi Nin Konegadaa
Pedachevin Bettaku Yesuni - Maatanu
|| Yesu ||
3)Maranabalamu Galavaanin - Naasananbu Jesenu
Maranabhayamulonunna - Vaarini Vidipinchenu
Praanamun Aa Siluvapaini - Baligaa Nidi Nin Konegadaa
Hrudayamun Teruvumu Yesunu Cherchuko
|| Yesu ||
4)Siluva Raktamu Chetanu - Nirdevulainavaarini
Madhyapu Godanu Padagotti - Aikyaparache Devunito
Praanamun Aa Siluvapaini - Balagaanidi Nin Konegadaa
Samaadhaana Padumika - Devunito - Yee Kshaname
|| Yesu ||
5)Daiva Svabhaavanbulo - Parisudhaatmuniyandu
Paralokapu Pilupulo - Paalivaarala Jesenu
Praanamun Aa Siluvapaini - Baligaanidi Nin Konegadaa
Parisuddhula Svaasthyamulo Paalibhaaga Mondumu
|| Yesu ||
6)Devuni Parisudhatalo - Kalugabovu Mahimalo
Kreestuyesu Prabhuvulo - Paalivaarala Jesenu
Praanamun Aa Siluvapaini - Baligaanidi Nin Konegadaa
Tvarapadu Needu Bhaagamunu Pondanu
|| Yesu ||
7)Paralokamulo Kanabadu - Tellanaina Vastramul
Dharinchukonu Samoohamu - Kharjooramattalu Chebooni
Devunikini Gorrepillakunu - Stotramulu Cheyuchunda
Neevu Nee Rakshanakai Paadumu - Hallelooya
|| Yesu ||