తెలుగు కలువరి గిరియందున యేసు
పల్లవికలువరి గిరి యందున - యేసు - కరములు జాపెనుగా
కలుషములన్ని - కడుగుకొనుము - ప్రభుయేసు రక్తముతో
1)విలువైన ప్రభురక్తము - విమోచన ధనమాయె - బలమైన
సాతాను మరణాయుధము ద్రుంచి - విజయము చేకూర్చును
|| క ||
2)ప్రవహించెను కలువరిలో - పావనరక్తధారల్
జీవమిచ్చుటకై జీవపు ఊటలు ధారవోసెను నీకై
|| క ||
3)నీ హృదయపు ద్వారమందు - రక్తపు గురుతున్నదా
రక్షణ నిచ్చును విశ్వాసముంచిన - పరలోక సుతుడౌదువు
|| క ||
4)కెంపువలె పాపమున్న - రక్తమువలె ఎర్రగున్న
హిమమువలెను తెలుపుగ జేయును - పావన ప్రభురక్తము
|| క ||
5)యేసే మార్గం - సత్యం, లేదే వేరొక మార్గం
భూలోకమందున పరలోకమందున - ప్రభువే నిజదైవము
|| క ||
English Kaluvari Giriyanduna Yesu
ChorusKaluvari Giri Yanduna - Yesu - Karamulu Jaapenugaa
Kalushamulanni - Kadugukonumu - Prabhuyesu Raktamuto
1)Viluvaina Prabhuraktamu - Vimochana Dhanamaaye - Balamaina
Saataanu Maranaayudhamu Drunchi - Vijayamu Chekoorchunu
|| Ka ||
2)Pravahinchenu Kaluvarilo - Paavanaraktadhaaral
Jeevamichchutakai Jeevapu Ootalu Dhaaravosenu Neekai
|| Ka ||
3)Nee Hrudayapu Dvaaramandu - Raktapu Gurutunnadaa
Rakshana Nichchunu Visvaasamunchina - Paraloka Sutudauduvu
|| Ka ||
4)Kenpuvale Paapamunna - Raktamuvale Erragunna
Himamuvalenu Telupuga Jeyunu - Paavana Prabhuraktamu
|| Ka ||
5)Yese Maargan - Satyan, Lede Veroka Maargam
Bhoolokamanduna Paralokamanduna - Prabhuve Nijadaivamu
|| Ka ||